Team India Captain: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

ఐర్లాండ్‌ సిరీస్‌కు యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గిల్‌ను సారథిగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

Rishvik
Published on: 21 March 2026 3:56 PM IST
Team India Captain
X

Team India Captain: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

Team India Captain:ఐపీఎల్ 2026 అనంతరం భారత్‌ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. జూన్ 6-10 మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. ఆపై ఐర్లాండ్‌తో భారత్ రెండు టీ20ల సిరీస్‌లలో తలపడనుంది. టీమిండియా సీనియర్‌ జట్టు రెండు టీ20ల సిరీస్‌ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది. తొలి టీ20 మ్యాచ్‌ జూన్ 26న, రెండో టీ20 మ్యాచ్‌ జూన్ 28న జరగనున్నాయి. ఈ సిరీస్ ముందు భారత క్రికెట్‌లో కీలక మార్పులకు నాంది పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐర్లాండ్‌ సిరీస్‌కు యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గిల్‌ను సారథిగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. భారత సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ గిల్‌ను టీ20 ఫార్మాట్‌కు పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా నియమించే దిశగా ఆలోచిస్తున్నారట. ఇప్పటికే రెండు ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్.. తన కెప్టెన్సీలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు.

రాబోయే టీ20 వరల్డ్ కప్, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడం ద్వారా దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. గిల్ నాయకత్వంలో జట్టు మంచి ఫలితాలు సాధిస్తుండటంతో.. అతడిని భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ఐర్లాండ్ సిరీస్ ఈ దిశలో ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ నాయత్వంలో భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో బీసీసీఐ అన్ని ఫార్మాట్లకు ఒకడే కెప్టెన్ అనే ఫార్ములా పాటిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రపంచ క్రికెట్లో టాప్ టీమ్స్ ఇద్దరేసి సారథులను నియమిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ మాత్రం మూడు ఫార్మాట్లలో ఒకరినే నియమించేందుకు ప్రయత్నిస్తోంది.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌ షెడ్యూల్:

తొలి టీ20 -జూన్ 26న

రెండో టీ20 - జూన్ 28న

Rishvik

Rishvik

Next Story