Vaibhav Sooryavanshi: ఫైనల్లో శ్రీలంక పరిస్థితి ఏంటో? పాపం.. తలుచుకుంటేనే తడిచిపోతుంది భయ్యా!
Vaibhav Sooryavanshi: ముక్కోణపు సిరీస్ ఫైనల్ చేరిన భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య టైటిల్ పోరుకు సర్వం సిద్ధమైంది.
Vaibhav Sooryavanshi: ఫైనల్లో శ్రీలంక పరిస్థితి ఏంటో? పాపం.. తలుచుకుంటేనే తడిచిపోతుంది భయ్యా!
Vaibhav Sooryavanshi: ముక్కోణపు సిరీస్ ఫైనల్ చేరిన భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య టైటిల్ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కేవలం ఒక సాధారణ ఫైనల్‌లా కాకుండా.. ఒక హై-వోల్టేజ్ రివెంజ్ మ్యాచ్‌లా మారిపోయింది. లీగ్ స్టేజ్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికీ.. మైదానంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కసితో ఉన్నాడు. లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్లు మనోడిని అనవసరంగా కెలికారని, ఇప్పుడు ఫైనల్లో దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు లంక జట్టుపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
లీగ్ మ్యాచ్‌లో అసలేం జరిగింది?:
లీగ్ స్టేజ్‌లో శ్రీలంక-ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 266 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక కూడా 50 ఓవర్లలో సరిగ్గా 265/9 స్కోరు చేయడంతో మ్యాచ్ 'టై' అయింది. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్‌లో 17 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ క్రమంలో క్రీజ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక ఫీల్డర్లు స్లెడ్జింగ్‌కు దిగారు. ముఖ్యంగా లంక ప్లేయర్ విషేన్ హలంబాగే వైభవ్‌ను వెక్కిరిస్తూ, చప్పట్లు కొడుతూ తీవ్రంగా రెచ్చగొట్టాడు. అసలే దూకుడు స్వభావం ఉన్న వైభవ్ ఏమాత్రం తగ్గకుండా అతడిపైకి దూసుకెళ్లాడు. మరో ఎండ్‌లో ఉన్న భారత బ్యాటర్ సూర్యాంశ్ వెంటనే స్పందించి వైభవ్‌ను అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
వైభవ్ క్రీజ్‌లో ఉంటే.. లంకకు నరకమే!
వైభవ్ సూర్యవంశీ ఎంతటి ప్రమాదకరమైన విధ్వంసకర బ్యాటరో ఇప్పటికే ఐపీఎల్ 2026లో క్రికెట్ ప్రపంచం చూసింది. అండర్-19 వరల్డ్ కప్‌లో శతకాల మోత మోగించిన ఈ యంగ్ సెన్సేషన్.. క్రీజ్‌లో సెట్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో వైభవ్ క్రీజ్‌లో కనీసం 15 ఓవర్ల పాటు నిలదొక్కుకున్నాడంటే.. లంక బౌలింగ్ లైనప్ తునాతునకలు కావడం ఖాయం. 'అనవసరంగా సింహాన్ని గెలికి ఎంత తప్పు చేశామో' అని లంక ప్లేయర్లు ఫైనల్లో తలపట్టుకునేలా వైభవ్ బ్యాటింగ్ ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఫైనల్ పోరుపై పెరిగిన ఉత్కంఠ
లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించి భారత్ ముందే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. తాజాగా జరిగిన మరో మ్యాచ్‌లో అఫ్గాన్-ఏపై శ్రీలంక గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో శ్రీలంక జట్టు ఫైనల్‌కు రావడం టైటిల్ పోరుపై ఆసక్తిని పీక్స్‌కు తీసుకెళ్లింది. వైభవ్ సూర్యవంశీ తన మునపటి ఎటాకింగ్ గేమ్‌తో లంక ప్లేయర్లను బెంబేలెత్తించాలని, మైదానంలోనే వారికి బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. వైభవ్ సెంచరీ కొట్టాలని, లంక ప్లేయర్లపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు.




