Sreesanth Slams Harbhajan Singh: హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ ఫైర్.. చెంపదెబ్బ ఘటనతో కోటి రూపాయల సంపాదన!

Sreesanth Slams Harbhajan Singh: పద్దెనిమిదేళ్ల క్రితం నాటి చెంపదెబ్బ ఘటనను హర్భజన్ సింగ్ వ్యాపారంగా మార్చుకున్నారని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక యాడ్ ద్వారా కోటి రూపాయలు సంపాదించారని, అందుకే అతడిని బ్లాక్ చేశానని వెల్లడించారు.

Arun Chilukuri
Published on: 25 April 2026 11:32 AM IST
Sreesanth Slams Harbhajan Singh
X

Sreesanth Slams Harbhajan Singh: హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ ఫైర్.. చెంపదెబ్బ ఘటనతో కోటి రూపాయల సంపాదన!

Sreesanth Slams Harbhajan Singh: 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో జరిగిన 'చెంపదెబ్బ' (Slapgate) వివాదం మళ్ళీ రాజుకుంది. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆనాటి చేదు జ్ఞాపకాన్ని హర్భజన్ తన స్వార్థం కోసం, డబ్బు సంపాదన కోసం వాడుకున్నారని శ్రీశాంత్ ఆరోపించారు.

ఆ ఘటన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని శ్రీశాంత్ అన్నారు. "నేను హర్భజన్‌ను మనస్ఫూర్తిగా క్షమించాను. కానీ అతను ఆ ఘటన ఆధారంగా ఒక వాణిజ్య ప్రకటన (AD) చేసి దాదాపు కోటి రూపాయలు సంపాదించాడు. ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని నాకు ఫోన్ చేసి మరీ అడిగారు. నేను నిన్ను క్షమిస్తాను కానీ, ఆ చెడును మాత్రం మర్చిపోలేను అని అప్పుడే చెప్పాను" అని శ్రీశాంత్ వివరించారు.

ఇటీవలి కాలంలో హర్భజన్ పలు ఇంటర్వ్యూలలో తన కుమార్తె గురించి ప్రస్తావిస్తూ, ఆనాడు శ్రీశాంత్‌ను కొట్టి తప్పు చేశానని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడని శ్రీశాంత్ విమర్శించారు. "ఇంటర్వ్యూలలో అతను చెప్పే మాటలన్నీ నటనేనని నాకు అర్థమైంది. ఆ యాడ్ చూసిన తర్వాతే హర్భజన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాను. ఆ ప్రకటనతో మా మధ్య ఉన్న కొద్దిపాటి బంధం కూడా తెగిపోయింది" అని శ్రీశాంత్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story