SRH Captain: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ హీరో.. వైస్ కెప్టెన్‌ ఎవరంటే?

SRH Captain 2026: మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజన్ ప్రారంభం కానుంది. మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది.

Rishvik
Published on: 18 March 2026 6:35 PM IST
SRH Captain
X

SRH Captain: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ హీరో.. వైస్ కెప్టెన్‌ ఎవరంటే?

SRH Captain: మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజన్ ప్రారంభం కానుంది. మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో కమ్మిన్స్ స్థానంలో వరల్డ్‌కప్‌ హీరో ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.

గాయం నుంచి కోలుకుంటున్న కమ్మిన్స్:

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నారు. వెన్ను గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2026తో పాటు 2025-2026 యాషెస్ సిరీస్‌లోని కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. పూర్తిగా కోలుకునే వరకు ఐపీఎల్‌ 2026లో కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో జట్టు బాధ్యతలను తాత్కాలికంగా ఇషాన్ కిషన్‌కు అప్పగించింది. కిషన్‌ నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్రదర్శన ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఝార్ఖండ్‌కు నాయకుడిగా కిషన్:

టీ20 ప్రపంచ కప్‌ 2026లో ఇషాన్ కిషన్‌ అదరగొట్టాడు. భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కిషన్ కీలక పాత్ర పోషించాడు. తొమ్మిది మ్యాచ్‌లలో 190కి పైగా స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేశాడు. కీలకమైన ఓపెనింగ్ సహా మూడవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఫైనల్‌లో సహా మూడు అర్ధ శతకాలు సాధించాడు. మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు. అంతకుముందు దేశవాళీలోనూ పరుగుల వరద పారించాడు. ఝార్ఖండ్‌కు నాయకుడిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.

ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్:

అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జయ్‌దేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరన్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జిషన్ అన్సారీ, లియామ్ లివింగ్‌స్టోన్, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫులే హింగే, క్రెయిన్స్, శివమ్ మావి.

Rishvik

Rishvik

Next Story