SRH Injury Blow: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మ‌రో ఎదురుదెబ్బ.. ఈ గాయాల బెడద ఇక ఆగదా?, లిస్ట్ పెద్దదే గురూ!

David Payne Ruled Out from IPL 2026: ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. విదేశీ పేసర్ డేవిడ్ పేన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది.

Rishvik
Published on: 16 April 2026 10:13 PM IST
SRH Injury Crisis in IPL 2026: David Payne Ruled Out, Cummins Set for Comeback
X

SRH Injury Blow: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మ‌రో ఎదురుదెబ్బ.. ఈ గాయాల బెడద ఇక ఆగదా?, లిస్ట్ పెద్దదే గురూ!

David Payne Ruled Out from IPL 2026: ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్) జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. సీజన్ ఆరంభానికి ముందే జాక్ ఎడ్వర్డ్స్ దూరమవగా.. ప్యాట్ కమిన్స్, బ్రైడన్ కార్స్ కూడా ఐపీఎల్ 2026కి దూరమయ్యారు. గాయం నుంచి కోలుకున్న కమిన్స్ త్వరలో జట్టులో కలుస్తున్నాడని సంతోషించే లోపే.. ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ పేసర్ డేవిడ్ పేన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. పేన్ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2026లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదు అని ఎక్స్‌లో పేర్కొంది.

ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో డేవిడ్ పేన్‌ను ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ జట్టులోకి తీసుకుంది. పేన్ కూడా యాంకిల్ ఇంజరీతో వైదొలగడం హైద‌రాబాద్‌ గాయాల సమస్యలను మరింత పెంచింది. ఈ సీజన్‌లో పేన్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. రెండు వికెట్లు తీసినప్పటికీ.. అతని ఎకానమీ రేట్ 14గా ఉండటం జట్టుకు భారంగా మారింది. ఇప్పుడు అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై ఎస్ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోట్జీ, అఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో పేరు చర్చలోకి వచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ గాయాల లిస్ట్ పెద్దదే. జాక్ ఎడ్వర్డ్స్, ప్యాట్ కమిన్స్, బ్రైడన్ కార్స్, డేవిడ్ పేన్.. నలుగురు ప్లేయర్స్ గాయాల కారణంగా ఐపీఎల్ 2026కి దూరమయ్యారు. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. కమిన్స్ గాయం నుంచి కోలుకోవడం. వెన్ను నొప్పితో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్ పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహించిన తాజా ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతడు ఉత్తీర్ణత సాధించాడు. ఐపీఎల్‌ 19లో ఆడేందుకు సీఏ నుంచి గ్రీన్ సిగ్నిల్ వచ్చింది. కమిన్స్ ఏప్రిల్ 17న హైదరాబాద్ చేరుకుంటాడు. ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story