SRH vs PBKS: దంచికొట్టిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్‌లో పరుగుల వర్షం.. పంజాబ్ ముందు టఫ్ టార్గెట్!
SRH post a massive 235/4 vs PBKS. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.
SRH vs PBKS: దంచికొట్టిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్‌లో పరుగుల వర్షం.. పంజాబ్ ముందు టఫ్ టార్గెట్!
SRH vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కాటేరమ్మ కొడుకులు దంచికొట్టారు. హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) మెరుపు అర్ధ శతకాలతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందుకు 236 పరుగుల టఫ్ టార్గెట్ ఉంది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో 38 పరుగులతో మంచి స్టార్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ పవర్‌ప్లేలోనే బౌలర్లపై ఒత్తిడి పెంచారు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ.. 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతనికి తోడుగా హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో విజయ్‌కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో మార్కో యాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడాడు. 13 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. జట్టు స్కోర్‌ను 235కి చేర్చాడు. చివరి ఓవర్లో ఎస్‌ఆర్‌హెచ్ 13 పరుగులుపిండుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గుసన్, యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాఖ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల దూకుడుకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు. చాహల్ మాత్రమే 32 రన్స్ ఇచ్చి పర్వాలేదనిపించారు. మిగతా బౌలర్లు విఫలమయ్యారు. ఈ పిచ్‌పై 236 పరుగుల లక్ష్యం చాలా పెద్దదే. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. అభిమానులు మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నారు.




