SRH vs CSK: సన్‌రైజర్స్‌దే బ్యాటింగ్.. మార్పులతో బరిలోకి చెన్నై.. అభిమానులకు నిరాశ!
SRH vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు తలపడనున్నాయి.
SRH vs CSK: సన్‌రైజర్స్‌దే బ్యాటింగ్.. మార్పులతో బరిలోకి చెన్నై.. అభిమానులకు నిరాశ!
SRH vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఎస్‌ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ ఆడలేదు. సన్‌రైజర్స్‌తో జరిగే పోరులో ఆడే అవకాశముందని వార్తలు వచ్చినా.. అవి నిజం కాలేదు. ఈ మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడడం లేదు. దాంతో హైదరాబాద్ సహా మహీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిచినా బ్యాటింగ్ చేసేవాళ్లమని తెలిపాడు. మంచి స్కోర్ బోర్డుపై పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. జట్టు తరఫున వ్యక్తిగత ప్రదర్శనలకంటే టీమ్ కోసం ఆడటం ముఖ్యమని స్పష్టం చేశాడు. ప్రారంభంలో బంతి కదిలే అవకాశం ఉండటంతో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. జట్టులో హర్ష్ దూబే స్థానంలో దిల్షాన్ మధుషంకా చేరినట్లు వెల్లడించాడు.
ఇక సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. జట్టు మెల్లిగా ఫామ్‌లోకి వస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. తాము బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ప్రదర్శన ఇస్తున్నామని తెలిపాడు. ఫీల్డింగ్‌లో కొంత మెరుగుదల అవసరమని అన్నాడు. నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ వంటి బౌలర్లు గత మ్యాచ్‌లో బాగా రాణించడం జట్టుకు ఆత్మవిశ్వాసం కలిగించిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కూడా ప్రాథమిక అంశాలను సరిగ్గా అమలు చేస్తే విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశాడు.
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్లు బలంగా ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లు ఉండగా.. సీఎస్‌కే తరఫున రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివమ్ దూబే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఉప్పల్‌లో ఈరోజు రన్ ఫెస్ట్‌కు రంగం సిద్ధమైందని చెప్పాలి. ఉప్పల్ మైదానం మరోసారి బ్యాటర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. పిచ్‌పై గడ్డి లేకపోవడం, గట్టి ఉపరితలం ఉండటంతో బౌన్స్ బాగా లభించే అవకాశం ఉంది. సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సుమారు 200 పైగా ఉండటంతో.. ఈ మ్యాచ్ కూడా హై స్కోరింగ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.




