SRH vs DC: సన్‌రైజర్స్‌ జట్టులో వికెట్ల వీరుడు అవుట్.. అక్షర్‌కు ఏమన్న అదృష్టమా, ఇషాన్‌కు మళ్లీ నిరాశ!

SRH vs DC: ఐపీఎల్‌ 2026లో మరి కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Rishvik
Published on: 21 April 2026 7:46 PM IST
SRH vs DC
X

SRH vs DC: సన్‌రైజర్స్‌ జట్టులో వికెట్ల వీరుడు అవుట్.. అక్షర్‌కు ఏమన్న అదృష్టమా, ఇషాన్‌కు మళ్లీ నిరాశ!

SRH vs DC: ఐపీఎల్‌ 2026లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. టాస్ విషయంలో తనకు అదృష్టం కలిసి వస్తోందని చెప్పాడు.

అక్షర్ వరుసగా ఎనమిది టాస్‌లు గెలిచాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు గెలిచిన జట్టుగా ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మంచి స్క్వాడ్ ఉండటంతో ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వడం కష్టమే అయినా.. జట్టు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో అకిబ్ నబీ స్థానంలో నితీష్ రాణాను తీసుకున్నట్లు అక్షర్ వెల్లడించాడు.

టాస్ అనంతరం మాట్లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. పిచ్ గత మ్యాచ్‌ల కంటే భిన్నంగా ఉందన్నాడు. ఇది స్లో ట్రాక్‌గా ఉండే అవకాశముందని, అందుకే జట్టులో స్పిన్ ఆప్షన్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించాడు. జట్టులో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపిన కిషన్..

హర్ష్ దూబేను తిరిగి జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. యువ బౌలర్లు మంచి మైండ్‌సెట్‌తో ఆడుతున్నారని, ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూముందుకు సాగుతామని అన్నాడు. వికెట్ల వీరుడు హింగే జట్టులో లేడని చెప్పాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఏడవ టాస్ ఓడిపోయింది. టాస్ విషయంలో ఇషాన్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: పాథుమ్‌ నిశాంక, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సమీర్‌ రిజ్వీ, నితీశ్‌ రాణా, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, టి నజరాజన్‌, లుంగి ఎంగిడి.

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, సలీల్‌ అరోరా (వికెట్‌ కీపర్‌), అనికేత్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శివాంగ్‌ కుమార్, హర్ష్‌ దూబె, సకీబ్‌ హుస్సేన్‌, ఎషాన్‌ మలింగ.

ఇంపాక్ట్‌ ప్లేయర్స్:

ఢిల్లీ: రుణ్‌ నాయర్‌, దుష్మంత చమీరా, అశుతోష్‌ శర్మ, త్రిపురాన విజయ్‌, అకిబ్‌ నబీ.

హైదరాబాద్: సమ్రాన్‌ రవిచంద్రన్‌, ప్రఫుల్ హింగే, లివింగ్‌ స్టోన్‌, దిల్షాన్‌ మదుశనక, హర్షల్‌ పటేల్‌.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story