SRH vs KKR: దుమ్మురేపిన కోల్‌కతా.. సన్‌రైజర్స్‌పై ఘన విజయం!
SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
SRH vs KKR: దుమ్మురేపిన కోల్‌కతా.. సన్‌రైజర్స్‌పై ఘన విజయం!
SRH vs KKR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.2 ఓవర్లలోనే ఛేదించి సునాయాసంగా గెలిచింది. స్టార్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ అజింక్య రహానే (43; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సన్‌రైజర్స్ తరఫున బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీసినా.. ఎక్కువ పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (61; 28 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. ఇషాన్ కిషన్ (42; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టాడు. అభిషేక్ శర్మ (15), హెన్రిచ్ క్లాసెన్ (11) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. స్మరన్ రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ (6), సలీల్ అరోరా (2), ప్యాట్ కమిన్స్ (10) నిరాశపర్చారు. 8.5 ఓవర్లకు 105/1తో పటిష్ఠ స్థితిలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ .. హెడ్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. 60 పరుగులకు చివరి 9 వికెట్లు కోల్పోయింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, కార్తిక్ త్యాగి 2, నరైన్ 2 వికెట్స్ తీశారు.
లక్ష్య ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కెప్టెన్ అజింక్య రహానే (43) మంచి ఆరంభం అందించగా.. అంగ్‌క్రిష్ రఘువంశీ (59) అర్ధ శతకంతో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. ఇనింగ్స్ చివర్లో రింకు సింగ్ (22) ధాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు తేలిపోయారు. బౌలర్లు అందరూ విఫలమవడంతో కోల్‌కతా సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. 10 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో ఓటమి. మరోవైపు తొమ్మిది మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు ఇది మూడో విజయం.




