SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్‌దే బ్యాటింగ్.. రాజస్థాన్ తుది జట్టులో లేని 'బుడ్డోడు'!
SRH vs RR: మరికొద్దిసేపట్లో ఎస్‌ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
SRH vs RR: ఎస్‌ఆర్‌హెచ్‌దే బ్యాటింగ్.. రాజస్థాన్ తుది జట్టులో లేని 'బుడ్డోడు'!
SRH vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు.
తుషార్ దేశ్‌పాండే, ప్రిటోరియస్ రాజస్థాన్ జట్టులోకి వచ్చారు. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ బుడ్డోడు బరిలోకి దిగనున్నాడు. తాము కూడా రెండు మార్పులు చేసినట్లు సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పాడు.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకేఒక్క విజయాన్ని నమోదు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిగతా బౌలర్లు భారీగా రన్స్ ఇచ్చుకోవడంతో విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ రాణిస్తున్నా..
హెడ్, నితీష్ విఫలమవుతున్నారు. మరోవైపు రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ భీకరమైన ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. అంతంత మాత్రమే బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్.. వైభవ్‌ను ఎలా అడ్డుకుంటుందో చూడాలి.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్, కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
రాజస్థాన్ ఇంపాక్ట్ ప్లేయర్స్: వైభవ్ సూర్యవంశీ, షిమ్రోన్ హెట్మెయర్, రవి సింగ్, శుభమ్ దూబే, బ్రిజేష్ శర్మ.
సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: స్మరన్ రవిచంద్రన్, సాకిబ్ హుస్సేన్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, హర్షల్ పటేల్.




