Hemang Badani Trolls: అప్పుడు ఫ్లెమింగ్‌ను అన్నావ్, ఇప్పుడు నువ్ ఏం సాధించావు?.. ఢిల్లీ కోచ్‌పై భారత మాజీ క్రికెటర్ ఫైర్!

Krishnamachari Srikkanth hits out at DC coach Hemang Badani. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశాజనక ప్రదర్శన చేయడంతో కోచ్ హేమంగ్ బదాని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

Rishvik
Published on: 28 April 2026 2:56 PM IST
Hemang Badani Trolls
X

Hemang Badani Trolls

Hemang Badani Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ ) జట్టు నిరాశాజనక ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతూ మూల్యం చెల్లించుకుంటోంది. 6 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. దాంతో ఢిల్లీ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోచ్ హేమంగ్ బదాని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బదానీని టార్గెట్ చేశాయి.

హేమంగ్ బదానీ ఒక సందర్భంలో సీఎస్‌కే విజయాలకు అసలు కారణం కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమేనని, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పెద్ద కోచ్ కాదని వ్యాఖ్యానించాడు. ఫ్లెమింగ్ ఇంతకీ ఏం సాధించాడు? అంటూ బదానీ ఫైర్ అయ్యాడు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటముల నేపథ్యంలో బదానీపై ట్రోల్ మొదలయ్యాయి. గతంలో బదానీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. భారత మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేవలం 75 పరుగులకే ఆలౌట్ కావడం నేపథ్యంలో శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో బదానీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

'ఇతరుల గురించి మాట్లాడే ముందు నీ పని సరిగా చూసుకో. జీవితంలో ఎక్కువగా మాట్లాడకూడదు అని నేనే ఎప్పుడూ చెబుతాను. హేమంగ్ బదానీ.. గతంలో మాట్లాడిన మాటల వల్లే ఇపుడు ఇబ్బందులు పడుతున్నావు' అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వార్నింగ్ ఇచ్చాడు. 'స్టీఫెన్ ఫ్లెమింగ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు?. చెన్నై విజయాలను కేవలం ఎంఎస్ ధోనీకి మాత్రమే ఆపాదించడం సరైంది కాదు. కోచ్ పాత్ర కూడా ఎంతో కీలకం. ఇప్పుడు నువ్వు ఏమి సాధించావు?' అంటూ బదానీని శ్రీకాంత్ ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జట్టు ఎంపికల విషయంలో కూడా క్రిస్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ ప్లేయర్ పృథ్వీ షాను పక్కనపెట్టి.. డెబ్యూ ఆటగాడు సహిల్ పారఖ్‌ను ఆడించడం సరైన నిర్ణయం కాదన్నాడు. అలాగే కీలక సమయంలో కేఎల్ రాహుల్ కంటే ముందుగా సహిల్ స్ట్రైక్ తీసుకోవడం కూడా ప్రశ్నార్థకమని పేర్కొన్నాడు. ఈ పరిణామాలు ఢిల్లీ కోచ్ బదానీ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఫ్లెమింగ్ పెద్ద కోచ్ అయితే ఐపీఎల్ వెలుపల ఎందుకు విజయాలు సాధించలేదని ప్రశ్నించిన బదానీ.. సీఎస్‌కే విజయాలకు ధోనీనే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఇప్పుడు ఢిల్లీ జట్టు పరాజయాలతో అవే ప్రశ్నలు బదానీని వెంటాడుతున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story