IPL 2026-Sunil Gavaskar: ఆ ఆటగాళ్లకు నిషేధం సరిపోదు, అంతకుమించి ఏదైనా చేయాలి.. బీసీసీఐకి గవాస్కర్ సూచన!

IPL 2026-Sunil Gavaskar: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున ఆడాల్సిన డకెట్.. చివరి క్షణంలో టోర్నీ నుంచి తప్పుకోవడం అభిమానులను నిరాశపరిచింది.

Rishvik
Published on: 29 March 2026 10:54 PM IST
Sunil Gavaskar Urges BCCI for Stricter Action After Ben Duckett IPL 2026 Withdrawal
X

IPL 2026-Sunil Gavaskar: ఆ ఆటగాళ్లకు నిషేధం సరిపోదు, అంతకుమించి ఏదైనా చేయాలి.. బీసీసీఐకి గవాస్కర్ సూచన!

IPL 2026-Sunil Gavaskar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తరఫున ఆడాల్సిన డకెట్.. చివరి క్షణంలో టోర్నీ నుంచి తప్పుకోవడం అభిమానులను నిరాశపరిచింది. ఇంగ్లాండ్ అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డకెట్ వెల్లడించాడు. అంతకుముందు కూడా ఐపీఎల్‌ నుంచి చివరి క్షణంలో కొందరు ప్లేయర్స్ తప్పుకున్నారు. ఈ నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీ ప్రారంభానికి ముందు విదేశీ ఆటగాళ్లు తప్పుకోవడం జట్ల ప్రణాళికలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమల్లో ఉన్న రెండు సంవత్సరాల నిషేధం సరిపోవడం లేదని, మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి గవాస్కర్ సూచించారు.

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'బెన్ డకెట్ తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైమైంది. గత యాషెస్ సిరీస్‌లో అతడు బాగా ఆడాడు. ది హండ్రెడ్ లీగ్‌లో రూ. 2 కోట్లు పలికాడు. హండ్రెడ్లో మంచి ధర రావడంతో ఐపీఎల్‌ ఛాన్స్‌ వదిలేశాడు అని కూడా మనం అనుకోవచ్చు. టెస్టు కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు రావడం లేదని చెప్పాడు కానీ ఇది అసలు విషయం. ఇలాంటి సమస్యలకు బీసీసీఐ వెంటనే చెక్ పెట్టాలి. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఐపీఎల్ విడిచే ఆటగాళ్లపై రెండు సంవత్సరాల నిషేధం పెద్దగా ప్రభావం చూపడం లేదు. వారు మళ్లీ ఐపీఎల్‌లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కఠిన నిర్ణయాలు అవసరం' అని సన్నీ బీసీసీఐకి సూచించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కెఎల్ రాహుల్‌తో కలిసి అతడు ఓపెనింగ్ చేస్తాడని భావించారు. అయితే ఈ నిర్ణయంతో జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ తరఫున ఆడడమే తనకు మొదటి ప్రాధాన్యం అని, అందుకే ఐపీఎల్‌ను వదులుకున్నానని డకెట్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో తాను ఆశించిన స్థాయిలో ఆడలేకపోయానని, భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నానని చెప్పాడు.

ఇప్పటికే బీసీసీఐ విదేశీ ఆటగాళ్లు చివరి క్షణంలో ఐపీఎల్ నుంచి తప్పుకుంటే రెండు సంవత్సరాల నిషేధం విధించే నియమాన్ని అమలు చేస్తోంది. కుటుంబ లేదా వైద్యపరమైన కారణాలు ఉంటే మినహాయింపు ఉంటుంది. ఎక్కువగా ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెటర్లే ఐపీఎల్‌ను వదిలిపెడుతుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ విధానం సరైన ఫలితాలు ఇవ్వడం లేదని సునీల్ గవాస్కర్ అంటున్నారు. మొత్తానికి డకెట్ నిర్ణయం ఐపీఎల్ జట్ల ప్రణాళికలపై ప్రభావం చూపడంతో పాటు, విదేశీ ఆటగాళ్ల బాధ్యతపై మరోసారి చర్చను రేకెత్తించింది. భవిష్యత్తులో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story