Sunil Narine: చరిత్ర సృష్టించిన నరైన్.. ఐపీఎల్‌లోనే మొదటి బౌలర్!

Sunil Narine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో అరుదైన ఘనత నమోదైంది.

Rishvik
Published on: 3 May 2026 7:08 PM IST
Sunil Narine
X

Sunil Narine: చరిత్ర సృష్టించిన నరైన్.. ఐపీఎల్‌లోనే మొదటి బౌలర్!

Sunil Narine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో అరుదైన ఘనత నమోదైంది. వెస్టిండీస్ ఆటగాడు, కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఈ మైలురాయిని అందుకున్న తొలి విదేశీ ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున రెండు వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు ఖాతాలో చేరింది. సునీల్ కంటే ముందు ఈ ఘనతను టీమిండియా బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే సాధించారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. యూజీ 228 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ 215 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా 200 వికెట్లు పూర్తి చేసిన సునీల్ నరైన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పీయూష్ చావ్లా (192 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (187 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (186 వికెట్లు), డ్వేన్ బ్రేవో (183 వికెట్లు), రవీంద్ర జడేజా (177 వికెట్లు), అమిత్ మమిశ్రా (174 వికెట్లు), లసిత్ మలింగా (170 వికెట్లు) తదితరులు కొనసాగుతున్నారు.

సునీల్ నరైన్ ఈ ఘనతను అందుకోవడం అతని నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. ఎన్నో సీజన్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కీలక బౌలర్‌గా కొనసాగుతున్న అతను.. పవర్‌ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు సమర్థంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. సునీల్ నరైన్ సాధించిన ఈ ఘనత అతని ప్రతిభ, అనుభవానికి అద్దం పడుతోంది. భవిష్యత్తులో మరిన్ని వికెట్లు సాధిస్తూ ఈ జాబితాలో ఇంకా పైస్థానాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు:

228 - యుజ్వేంద్ర చాహల్ (179)

215 - భువనేశ్వర్ కుమార్ (199)

200* - సునీల్ నరైన్ (195)

192 - పీయూష్ చావ్లా (191)

187 - రవిచంద్రన్ అశ్విన్ (217)

186 - జస్ప్రీత్ బుమ్రా (154)

183 - DJ బ్రావో (158)

177 - రవీంద్ర జడేజా (233)

174 - అమిత్ మిశ్రా (162)

170 - లసిత్ మలింగ (122)

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story