Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో ఉండి దండగ.. బీసీసీఐ సంచలన వ్యాఖ్యలు!

Suryakumar Yadav: BCCI on Suryakumar Yadav Captaincy. టీ20 ప్రపంచ కప్ 2026లో జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది.

Rishvik
Published on: 6 Jun 2026 4:34 PM IST
Suryakumar Yadav
X

Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో ఉండి దండగ.. బీసీసీఐ సంచలన వ్యాఖ్యలు!

Suryakumar Yadav: భారత క్రికెట్‌లో కీలక మార్పులకు తెరలేచింది. టీ20 ప్రపంచ కప్ 2026లో జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. మూడు నెలల క్రితం భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచ కప్‌ను అందించిన కెప్టెన్‌ను ఇప్పుడు టీ20 జట్టు నాయకత్వం నుంచి తప్పించడమే కాకుండా..

ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో సహా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల జట్లలో కూడా చోటు కల్పించలేదు. సూరీడి స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నియమించింది. సూర్యకుమార్‌ను సారథిగా తప్పించారు ఓకే.. కనీసం జట్టులోకి కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం.

టీమిండియా భవిష్యత్తు కోసం:

టీమిండియా కెప్టెన్ మార్పు నిర్ణయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. జట్టు భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సూర్యకుమార్ యాదవ్‌తో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలిపిన అగార్కర్.. ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌ను తప్పించడం అంత సులభమైన విషయం కాదన్నారు. అయితే వచ్చే రెండు సంవత్సరాల టీ20 ప్రణాళికలు, తదుపరి ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

'సూర్య విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. అతను జట్టుకు ప్రపంచ కప్ అందించాడు. కానీ ప్రతి ప్రపంచ కప్ తర్వాత జట్టు భవిష్యత్తు గురించి పునరాలోచన చేయడం సహజం. సూర్య ఫామ్‌తో పాటు వచ్చే రెండేళ్ల ప్రణాళికలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చాం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతకు పూర్తి అర్హుడు' అని అగార్కర్ వివరించారు.

పరుగులు చేయలేకపోతున్న సూర్య:

సూర్యకుమార్ యాదవ్ గణాంకాలను పరిశీలిస్తే.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడి ప్రదర్శన గణనీయంగా పడిపోయింది. జూలై 2024లో టీ20 కెప్టెన్ అయిన తర్వాత సూరీడు 25.88 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఆరు అర్ధ సెంచరీలు చేసినప్పటికీ నాలుగు సార్లు డక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్సీకి ముందు మాత్రం 43.60 సగటుతో పరుగులు చేస్తూ నాలుగు సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు చేశాడు.

2025 ఆసియా కప్, 2026 టీ20 ప్రపంచ కప్‌లను భారత్ గెలవడంలో సూర్యకుమార్ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. అయితే వ్యక్తిగతంగా అతడి బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం 702 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 44 నుంచి 26కు పడిపోయింది.

పెద్దగా ప్రభావం లేదు:

టీ20 ప్రపంచ కప్ 2026లో కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. అమెరికాపై 84 పరుగులు చేసి మంచి ఆరంభం చేసినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. ఐపీఎల్ 2026లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 13 మ్యాచులలో 270 రన్స్ చేశాడు.

అత్యధిక స్కోర్ 60 (రాజస్థాన్ రాయల్స్). ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ సెలెక్టర్లు జట్టును యువ ఆటగాళ్లతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సూర్య సేవలను ఎవరూ మర్చిపోలేరు:

అయితే సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 క్రికెట్‌కు చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. అతడి నాయకత్వంలో భారత్ చరిత్ర సృష్టించి.. మూడో టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కొత్త టీ20 శకం ప్రారంభం కానుండగా.. సూర్య భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 2028 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ చేపడుతున్న మార్పులు భారత క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story