T20 World Cup Prize Money: ఛాంపియన్ భారత్‌కు రూ.24.28 కోట్లు.. టీమ్స్ ప్రైజ్ మనీ ఫుల్ లిస్ట్ ఇదే!
T20 World Cup Prize Money: ఐసీసీ తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.24.28 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
T20 World Cup Prize Money: ఛాంపియన్ భారత్‌కు రూ.24.28 కోట్లు.. టీమ్స్ ప్రైజ్ మనీ ఫుల్ లిస్ట్ ఇదే!
T20 World Cup Prize Money: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.24.28 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలిచిన టీమిండియా ఈ భారీ నగదు బహుమతిని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన న్యూజీలాండ్ రన్నరప్‌గా నిలిచి రూ.13.09 కోట్లు అందుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ దాకా పోరాడిన దక్షిణాఫ్రికా జట్టుకు రూ.9.25 కోట్లు, ఇంగ్లాండ్‌కు రూ.8.96 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఈ రెండు జట్లు మెగా టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో చివరి దశల వరకు చేరాయి. ఇక సూపర్ 8 దశలో నిలిచిన జట్లకు కూడా భారీ మొత్తంలో నగదు బహుమతి అందింది. వెస్టిండీస్‌కు రూ.4.95 కోట్లు, పాకిస్థాన్‌కు రూ.4.81 కోట్లు, జింబాబ్వేకు రూ.4.52 కోట్లు, శ్రీలంకకు రూ.4.38 కోట్లు ప్రైజ్ మనీగా లభించాయి. ఈ జట్లు టోర్నీలో గట్టి పోటీ ఇచ్చినా చివరి దశకు చేరుకోలేకపోయాయి.
మరోవైపు ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్, అమెరికా జట్లకు తలో రూ.2.85 కోట్లు దక్కాయి. స్కాట్లాండ్‌కు రూ.2.56 కోట్లు, ఐర్లాండ్‌కు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఇటలీ, నెదర్లాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నేపాల్ జట్లకు తలో రూ.2.36 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చారు. కెనడా, నమీబియా, ఒమాన్ జట్లకు తలా రూ.2.07 కోట్లు అందాయి. మొత్తంగా ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకు వారి ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో ఈ టోర్నమెంట్‌కు ఉన్న ప్రాముఖ్యత మరింత స్పష్టమైంది.
ఫైనల్ టీమ్స్:
భారత్ (ఛాంపియన్): రూ. 24.25 కోట్లు
న్యూజిలాండ్ (రన్నరప్): రూ. 13.08 కోట్లు
సెమీఫైనల్ టీమ్స్:
దక్షిణాఫ్రికా (సెమీఫైనలిస్ట్): రూ. 9.24 కోట్లు
ఇంగ్లాండ్ (సెమీఫైనలిస్ట్): రూ. 8.96 కోట్లు
సూపర్-8 టీమ్స్:
వెస్టిండీస్: రూ. 4.95 కోట్లు
పాకిస్థాన్: రూ. 4.80 కోట్లు
జింబాబ్వే: రూ. 4.52 కోట్లు
శ్రీలంక: రూ. 4.37 కోట్లు
లీగ్ స్టేజ్ టీమ్స్:
అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ: రూ. 2.85 కోట్లు (ఒక్కో జట్టుకు)
స్కాట్లాండ్: రూ. 2.56 కోట్లు
ఐర్లాండ్: రూ. 2.50 కోట్లు
ఇటలీ, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్: రూ. 2.35 కోట్లు (ఒక్కో జట్టుకు)
కెనడా, నమీబియా, ఒమన్ : రూ. 2.06 కోట్లు (ఒక్కో జట్టుకు)




