Asian Games Cricket: ఏషియన్ గేమ్స్ 2026కు టీమిండియా స్వ్కాడ్.. కెప్టెన్‌గా ఎవరంటే?
Asian Games Cricket: జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ కోసం టీమిండియా 15 మంది సభ్యుల జట్టు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది.
Asian Games Cricket: ఏషియన్ గేమ్స్ 2026కు టీమిండియా స్వ్కాడ్.. కెప్టెన్‌గా ఎవరంటే?
Asian Games Cricket: జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్ 2026 (Asian Games 2026) పురుషుల క్రికెట్ కోసం టీమ్‌ఇండియా తుది జట్టు సిద్ధమైంది. బీసీసీఐ ప్రకటించే 15 మంది సభ్యుల బృందానికి శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించే ఛాన్స్ ఉంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. గత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత్.. ఈసారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
అయ్యర్ చేతిలో నాయకత్వ బాధ్యతలు..
టీ20ఐ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఈ టోర్నీ మరో కీలక పరీక్ష కానుంది. అతడికి డిప్యూటీగా తిలక్ వర్మ ఉండనున్నాడు. ఇద్దరూ భారత టీ20ఐ సెటప్‌లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్‌లో వారి నాయకత్వంపై ఆసక్తి నెలకొంది.
యువతకు తోడుగా..
భారత 15 మంది జట్టులో యువ, సీనియర్ ఆటగాళ్లకు సమాన ప్రాధాన్యం లభించింది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్లతో పాటు సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
బుమ్రా, అర్ష్‌దీప్‌తో పేస్ బలం..
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), అర్షదీప్ సింగ్ (Arshdeep Singh)తో పాటు హర్షిత్ రాణా ఉన్నారు. స్పిన్ బాధ్యతలను వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ నిర్వర్తించనున్నారు. దీంతో టీమిండియా స్వ్కాడ్ (Team India Squad)లో బ్యాటింగ్, ఆల్‌రౌండింగ్, బౌలింగ్ విభాగాలకు సమతూకం కనిపిస్తోంది.
సెప్టెంబర్ 28న భారత్ తొలి మ్యాచ్..
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. భారత్ సహా నాలుగు జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించింది. అందువల్ల టీమ్‌ఇండియా సెప్టెంబర్ 28న గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో తొలి మ్యాచ్ ఆడుతుంది. గెలిస్తే అక్టోబర్ 1న సెమీఫైనల్.. అక్కడ విజయం సాధిస్తే అక్టోబర్ 3న స్వర్ణ పతక పోరు ఉంటుంది. సెమీస్‌లో ఓడితే కాంస్య పతకం కోసం మ్యాచ్ ఆడుతుంది.
టీమిండియా 15 మంది స్వ్కాడ్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.




