Mohammed Shami: రాజకీయాల్లోకి టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ షమీ?

Mohammed Shami: టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం వైరల్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 21 Sept 2026 12:28 PM IST
Mohammed Shami
X

Mohammed Shami: రాజకీయాల్లోకి టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ షమీ?

Mohammed Shami: టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) పార్టీ అధినేత, కేంద్ర మంత్రి జయంత్‌ చౌధరీతో షమీ దిల్లీలో సమావేశం కావడమే ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో షమీ పోటీ చేసే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. షమీ తన సొంత జిల్లా అయిన అమ్రోహా శాసనసభ నియోజకవర్గం నుంచి ఆర్‌ఎల్‌డీ టికెట్‌పై బరిలోకి దిగుతారనే ప్రచారం మొదలైంది.

యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంలో ఆర్‌ఎల్‌డీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎస్పీ ఆధీనంలో ఉన్న అమ్రోహా స్థానంలో షమీని రంగంలోకి దించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎన్డీయే కూటమి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ భేటీపై గానీ, తన రాజకీయ ప్రవేశంపై గానీ షమీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గతంలోనూ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ షమీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారాలు జరిగాయి. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. సెలక్టర్లు మాత్రం షమీ వైపు చూడటం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి ఆయన జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.