Tilak Varma: ఐపీఎల్‌లో చరిత్రలో మరో సంచలనం.. తిలక్ వర్మ అద్భుత సెంచరీ, ఎన్ని బంతుల్లో అంటే
Tilak Varma: ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ అద్భుతమైన ఆటతో ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.
Tilak Varma
Tilak Varma: ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తిలక్ వర్మ, అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి బంతికి బౌండరీ కొట్టి తన శతకాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు బంతికి సిక్స్ కొట్టి 97 పరుగులకు చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 7 సిక్స్‌లు, 8 ఫోర్‌లు కొట్టి 224కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఇది ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం కావడం విశేషం.
ప్రారంభంలో నెమ్మది… తర్వాత మెరుపు బ్యాటింగ్
తిలక్ వర్మ మొదట నెమ్మదిగా ఆడాడు. 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. కానీ తర్వాత తన ఆటను పూర్తిగా మార్చేశాడు. చివరి 23 బంతుల్లోనే 82 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ శతకం సాధించడం కూడా ప్రత్యేక రికార్డుగా నిలిచింది.
దిగ్గజాలతో సమానంగా… కొత్త రికార్డులు
ఈ శతకం ద్వారా తిలక్ వర్మ, జయసూర్య చేసిన 45 బంతుల్లో శతకం రికార్డును సమం చేశాడు. అలాగే రోహిత్ శర్మ వంటి దిగ్గజాల కంటే వేగంగా ఈ ఫీట్ సాధించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఇది ఇప్పటివరకు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది.
ముంబైకి భారీ విజయం
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 199 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన గుజరాత్ టైటాన్స్ కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశ్విన్ కుమార్ 4 వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడు. అలాగే బుమ్రా కూడా కీలక వికెట్ సాధించాడు.




