India A Captain: ఇండియా-ఏ కెప్టెన్‌గా తెలుగోడు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్!
India A Captain: భారత యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మరో మంచి అవకాశం లభించింది.
India A Captain: ఇండియా-ఏ కెప్టెన్‌గా తెలుగోడు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్!
India A Captain: భారత యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మరో మంచి అవకాశం లభించింది. వచ్చే నెల శ్రీలంక వేదికగా జరగనున్న వన్డే ట్రై-సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియా-ఏ జట్టును గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు ఆటగాడియూ తిలక్ వర్మను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లతో కలిసి ఇండియా-ఏ ఈ ట్రై-సిరీస్‌లో పోటీ పడనుంది.
భారత యువ జట్టులో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఐపీఎల్ 2026లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్‌కు ఇది పెద్ద మంచి అవకాశంగా అందరూ భావిస్తున్నారు. అలాగే పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య కూడా జట్టులో చోటు సంపాదించారు. వికెట్ కీపర్ బ్యాటర్లుగా ప్రభ్‌సిమ్రన్ సహా కుమార్ కుషాగ్రాను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువ పేసర్లు అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్‌లకు కూడా అవకాశం లభించింది.
ఆల్‌రౌండర్ల విభాగంలో హర్ష్ దూబే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, అయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. తిలక్ వర్మ, రియాన్ పరాగ్ వంటి సీనియర్లు.. వైభవ్, అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ప్రభ్‌సిమ్రన్, ఆర్య వంటి జూనియర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కల్పించేందుకు బీసీసీఐ ఈ సిరీస్‌ను కీలకంగా భావిస్తోంది.
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఈ ట్రై-సిరీస్ జరగనుంది. జూన్ 9న శ్రీలంక-ఏతో ఇండియా-ఏ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 11న అఫ్గానిస్థాన్-ఏతో రెండో మ్యాచ్ జరుగుతుంది. అనంతరం జూన్ 15న మళ్లీ శ్రీలంక-ఏతో, జూన్ 17న అఫ్గానిస్థాన్-ఏతో ఇండియా-ఏ తలపడుతుంది. జూన్ 21న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ట్రై-సిరీస్ అనంతరం ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏతో రెండు డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఆ రెడ్ బాల్ సిరీస్‌కు సంబంధించిన జట్టును తర్వాత ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఇండియా-ఏ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), అయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్.




