Tim David Record: ఐపీఎల్‌లో టిమ్ డేవిడ్ చరిత్ర.. రోహిత్, కోహ్లీలకే సాధ్యం కాలేదు!
Tim David History: ఐపీఎల్‌లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
Tim David Record: ఐపీఎల్‌లో టిమ్ డేవిడ్ చరిత్ర.. రోహిత్, కోహ్లీలకే సాధ్యం కాలేదు!
Tim David History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 రన్స్ చేయడంతో 1000 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో టిమ్ డేవిడ్ 560 బంతుల్లో వెయ్యి రన్స్ చేశాడు. ఈ ఘనత భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సురేష్ రైనా లాంటి వారికే సాధ్యం కాలేదు.
ఈ జాబితాలో వెస్టిండీస్ హిట్టర్, కేకేఆర్ మాజీ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. రస్సెల్ 545 బంతుల్లోనే 1000 పరుగులు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించాడు. అతని దూకుడు బ్యాటింగ్‌కు ఇది ఓ నిదర్శనం అని చెప్పాలి. రెండో స్థానంలో టిమ్ డేవిడ్ ఉన్నాడు. ప్రస్తుతం డేవిడ్ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. మూడో స్థానంలో ఆసీస్ హిట్టర్ ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఉన్నారు. ఈ ఇద్దరూ 575 బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేశారు. వీరి అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (594 బంతులు), టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (604 బంతులు) నిలిచారు. ఐపీఎల్‌లో ఇప్పుడు హైదరాబాద్ తరఫున క్లాసెన్ ఆడుతున్నాడు. సెహ్వాగ్ గతంలో పంజాబ్, ఢిల్లీ జట్లకు ఆడాడు. ఈ గణాంకాలు చూస్తే.. ఐపీఎల్‌లో ఆధునిక క్రికెట్ ఎంత వేగంగా మారిందో అర్థమవుతోంది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం ఇప్పుడు టీమ్‌లకు కీలకంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్, ఫినిషర్ల పాత్ర ఎంత ముఖ్యమో ఈ లిస్ట్ స్పష్టం చేస్తోంది.
అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్:
545 - ఆండ్రీ రస్సెల్
560 - టిమ్ డేవిడ్
575 - ట్రావిస్ హెడ్
575 - ఫిల్ సాల్ట్
594 - హెన్రిచ్ క్లాసెన్
604 - వీరేంద్ర సెహ్వాగ్




