Urvil Patel Records: ఊర్విల్ పటేల్ విధ్వంసం.. డివిలియర్స్ రికార్డు బద్దలు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

Urvil Patel created history in IPL 2026. చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ ఐపీఎల్ 2026లో సెన్సేషన్‌గా మారిపోయాడు.

Rishvik
Published on: 10 May 2026 7:14 PM IST
Urvil Patel Records
X

Urvil Patel Records: ఊర్విల్ పటేల్ విధ్వంసం.. డివిలియర్స్ రికార్డు బద్దలు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

Urvil Patel Records: చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ ఐపీఎల్ 2026లో సెన్సేషన్‌గా మారిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఊర్విల్.. మొత్తంగా 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 65 రన్స్ చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ఉర్విల్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి 10 బంతుల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు.

లక్నో బౌలర్లపై ఊర్విల్ పటేల్ మొదటి నుంచే ఎదురుదాడికి దిగాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లతో విరుచుకుపడుతూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే తన ఇన్నింగ్స్ తొలి 10 బంతుల్లోనే 42 పరుగులు బాదాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ యశస్వి జైస్వాల్‌ల రికార్డులను ఊర్విల్ అధిగమించాడు. డివిలియర్స్ 2015లో ముంబై ఇండియన్స్‌పై 10 బంతుల్లో 41 పరుగులు చేయగా.. యశస్వి 2023లో కేకేఆర్‌పై 10 బంతుల్లో 41 స్కోర్ సాధించాడు. ఇప్పుడు ఊర్విల్ ఆ ఇద్దరినీ దాటి అగ్రస్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి 10 బంతుల్లో అత్యధిక పరుగులు:

42 – ఊర్విల్ పటేల్ vs ఎల్‌ఎస్‌జీ, చెన్నై, 2026

41 – ఏబీ డివిలియర్స్ vs ముంబై ఇండియన్స్, బెంగళూరు, 2015

41 – యశస్వి జైస్వాల్ vs కేకేఆర్, కోల్‌కతా, 2023

40 – అభిషేక్ శర్మ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ, 2024

39 – రొమారియో షెపర్డ్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై WS, 2024

39 – ప్రియాంశ్ ఆర్య vs సీఎస్‌కే, చెన్నై, 2026

అంతేకాదు సీఎస్‌కే తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్ల జాబితాలో కూడా ఊర్విల్ పటేల్ చోటు సంపాదించాడు. కనీసం 20 బంతులు ఎదుర్కొన్న ఇన్నింగ్స్‌లలో అతడి 282.6 స్ట్రైక్‌రేట్ సీఎస్‌కే చరిత్రలో రెండో అత్యుత్తమంగా నిలిచింది. ఈ జాబితాలో సురేశ్ రైనా అగ్రస్థానంలో ఉన్నాడు. 2014 క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌పై రైనా 25 బంతుల్లో 87 పరుగులు చేసి 348 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు.

సీఎస్‌కే తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో ఇన్నింగ్స్‌లు (కనీసం 20 బంతులు):

348 – 87(25) – సురేశ్ రైనా vs పంజాబ్ కింగ్స్, 2014

282.6 – 65(23) – ఊర్విల్ పటేల్ vs ఎల్‌ఎస్‌జీ, 2026

266.66 – 72*(27) – అంబటి రాయుడు vs ముంబై ఇండియన్స్, 2021

255 – 51*(20) – ఎంఎస్ ధోని vs ముంబై ఇండియన్స్, 2012

247.82 – 57(23) – డెవాల్డ్ బ్రెవిస్ vs గుజరాత్ టైటాన్స్, 2025

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story