Urvil Patel History: ఊర్విల్ పటేల్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ!

Urvil Patel History: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.

Rishvik
Published on: 10 May 2026 6:56 PM IST
Urvil Patel History
X

Urvil Patel History: ఊర్విల్ పటేల్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ!

Urvil Patel History: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఊర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఫిఫ్టీ చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనతతో రాజస్థాన్ రాయల్స్ స్టార్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

సంజు శాంసన్ అవుట్ అనంతరం ఊర్విల్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. అతడు ఆడిన తొలి బంతి నుంచే దంచుడు మొదలెట్టాడు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ.. పరుగుల వరద పారించాడు. అవేశ్‌ ఖాన్ వేసిన ఐదో ఓవర్లో నాలుగు సిక్సులతో 25 పరుగులు చేశాడు. దిగ్వేశ్‌ రాఠీ వేసిన ఆరో ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. ఈ క్రమముల్ కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితాలో యశస్వి జైస్వాల్‌తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. యశస్వి 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది ఈ రికార్డు నెలకొల్పాడు.

ఈ జాబితాలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ కూడా ఉన్నారు. కేఎల్ రాహుల్ 2018లో పంజాబ్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. పాట్ కమిన్స్ 2022లో ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 2025లో సీఎస్‌కేపై ఆర్సీబీ తరఫున రొమారియో షెపర్డ్ కూడా 14 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డుల్లో చోటు సంపాదించాడు.

ఊర్విల్ పటేల్ ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ధాటిగా ఆడే క్రమంలో ఉర్విల్ 10వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాబాజ్ అహ్మద్ వేసిన 9.2 ఓవర్‌కు అవేశ్‌ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఊర్విల్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 65 రన్స్ చేశాడు. ఈ యువ ఆటగాడి నిర్భయమైన బ్యాటింగ్ స్టైల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భవిష్యత్తులో టీమిండియాకు కూడా అతడు కీలక ఆటగాడిగా మారే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు (బంతుల పరంగా):

13 బంతులు – యశస్వి జైస్వాల్ (ఆర్ఆర్) vs కేకేఆర్, కోల్‌కతా, 2023

13 బంతులు – ఊర్విల్ పటేల్ (సీఎస్‌కే) vs ఎల్‌ఎస్‌జీ, లక్నో, 2026

14 బంతులు – కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) vs ఢిల్లీ, 2018

14 బంతులు – పాట్ కమిన్స్ (కేకేఆర్) vs ముంబై ఇండియన్స్, 2022

14 బంతులు – రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ) vs సీఎస్‌కే, 2025

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story