Vaibhav Sooryavanshi History: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్‌లోనే మొదటి బ్యాటర్‌గా బుడ్డోడు!
Vaibhav Sooryavanshi History: వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 500 రన్స్ చేసిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు.
Vaibhav Sooryavanshi History: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్‌లోనే మొదటి బ్యాటర్‌గా బుడ్డోడు!
Vaibhav Sooryavanshi History: ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షిస్తున్న భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 500 రన్స్ చేసిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. కేవలం 227 బంతుల్లోనే 500 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మద్య జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. అతడు 260 బంతుల్లో 500 పరుగులు బాదాడు. ఇప్పుడు బుడ్డోడు మ్యాక్స్‌వెల్ రికార్డును బ్రేక్ చేసి.. కొత్త చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీకి 500 పరుగులు పూర్తి చేయడానికి కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఒక అద్భుతమైన ఫోర్ కొట్టి.. ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ షాట్‌తో స్టేడియంలో ఉన్న అభిమానులు ఆనందోత్సాహాలతో ఒక్కసారిగా ఊగిపోయారు. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించినా.. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. మోహ్సిన్ బౌలింగ్‌లో నాలుగో ఓవర్ చివరి బంతికి దిగ్వేశ్ సింగ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి వైభవ్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఆడిన బుడ్డోడు 8 పరుగులే చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో 7 మ్యాచ్‌లలో 254 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 230గా ఉంది. ఐపీఎల్ 2026లో బుడ్డోడు ఆర్‌సీబీపై 26 బంతుల్లో 78 పరుగులు బాదాడు. సీఎస్‌కేపై 17 బంతుల్లో 52 రన్స్ చేసిన వైభవ్.. ముంబైపై 14 బంతుల్లో 39 పరుగులు చేసి సత్తా చాటాడు. కోల్‌కతాపై 28 బంతుల్లో 46 రన్స్, గుజరాత్‌పై 18 బంతుల్లో 31 రన్స్ చేశాడు. హైదరాబాద్‌పై డకౌట్ అయిన బుడ్డోడు.. లక్నోపై 8 రన్స్ చేసి నిరాశపరిచాడు. ఈ సీజన్లో ధాటిగా ఆడుతున్న వైభవ్.. తన కెరీర్‌లో 500 ఐపీఎల్ పరుగులు దాటిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రారంభం నుంచే ఆగ్రెసివ్‌గా ఆడుతూ.. జట్టుకు బలమైన ఆరంభాలు అందిస్తున్నాడు. అతని ప్రదర్శన చూస్తుంటే.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఒక గొప్ప స్టార్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2026లో సూర్యవంశీ సృష్టించిన ఈ రికార్డు టోర్నీ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోనుంది.




