Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్.. 15 ఏళ్లకే టీ20ల్లో బుడ్డోడు నయా చరిత్ర!

Vaibhav Sooryavanshi created history in IPL. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

Rishvik
Published on: 10 May 2026 5:29 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్.. 15 ఏళ్లకే టీ20ల్లో బుడ్డోడు నయా చరిత్ర!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున ఆడుతున్న వైభవ్.. శనివారం గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్సర్ బాది టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

మొహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోని తొలి బంతినే వైభవ్ సూర్యవంశీ స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో కేవలం 514 బంతుల్లోనే 100 టీ20 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా కూడా నిలిచాడు. గతంలో ఉన్న రికార్డులను అధిగమిస్తూ వైభవ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో మరో శతకం బాది సంచలనం సృష్టించాడు. 40 బంతుల లోపే రెండు ఐపీఎల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా కూడా వైభవ్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. పవర్‌ప్లేలోనే మూడు సిక్సర్లు బాదడంతో మరో భారీ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఓ ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. ప్రస్తుతం అతడు 2026 సీజన్‌లో పవర్‌ప్లేలోనే 30 సిక్సర్లు బాది అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ పేరిట ఉన్న 29 సిక్సర్ల రికార్డును అధిగమించాడు.

ఐపీఎల్‌లో ఒక సీజన్ పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు:

30 – వైభవ్ సూర్యవంశీ (2026)

29 – అభిషేక్ శర్మ (2024)

27 – అభిషేక్ శర్మ (2026)

22 – సనత్ జయసూర్య (2008)

22 – ట్రావిస్ హెడ్ (2024)

22 – యశస్వి జైస్వాల్ (2025)

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story