Sooryavanshi: సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఎంతైనా రాసుకో అంటూ బ్లాంక్ చెక్!

Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్‌లోనే కాదు ప్రకటనల ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు.

Rishvik
Published on: 2 Jun 2026 5:40 PM IST
Sooryavanshi
X

Sooryavanshi: సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఎంతైనా రాసుకో అంటూ బ్లాంక్ చెక్!

Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 16 మ్యాచ్‌లలో 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు బాదాడు. టోర్నీలో దిగ్గజాలు ఉన్నా.. తనదైన ఆటతో బుడ్డోడు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 ద్వారా వైభవ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు క్రికెట్‌లోనే కాదు ప్రకటనల ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్ అభిమానులను తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్.. ఇప్పుడు తన బ్రాండ్ విలువను కూడా భారీగా పెంచుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్ తర్వాత రెట్టింపైన డిమాండ్:

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందానికి సుమారు రూ.1 కోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన అనంతరం అతని మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో ప్రకటన ఒప్పందానికి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట.

కాంప్లాన్, రెడ్ బుల్‌తో భారీ ఒప్పందాలు:

2026 ఐపీఎల్‌కు ముందు బుడ్డోడు వైభవ్ ప్రముఖ బ్రాండ్లు కాంప్లాన్, రెడ్ బుల్‌తో దాదాపు రూ.1 కోటి విలువైన ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అయితే ఇప్పుడు అతని క్రేజ్ మరింత పెరగడంతో.. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు అతనితో ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

బ్యాట్ స్పాన్సర్‌షిప్‌కు బ్లాంక్ చెక్ ఆఫర్:

వైభవ్ సూర్యవంశీకి తాజాగా బ్యాట్ స్పాన్సర్‌షిప్ కోసం భారీ ఆఫర్ వచ్చినట్లు కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక ప్రముఖ కంపెనీ అతనికి బ్లాంక్ చెక్ తరహా ప్రతిపాదన చేసిందని తెలుస్తోంది. ఆ ఒప్పందం ఏడాదికి రూ.12 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. ఈ ఆఫర్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

క్రికెట్‌తో పాటు బ్రాండ్ ప్రపంచంలోనూ దూసుకెళ్తున్న వైభవ్:

ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు వ్యాపార, ప్రకటనల రంగాల్లోనూ అత్యంత విలువైన యువ క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు. అతని కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. ఇప్పటికే కోట్ల రూపాయల ఒప్పందాలు అతని తలుపు తడుతుండటం విశేషం. ఐపీఎల్ 2026 ద్వారా బుడ్డోడు 2.5 కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story