IND vs AFG: ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ ఎంట్రీ.. కీలక అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్..!
vaibhav sooryavanshi: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డగౌట్‌కే పరిమితమైన యువ సంచలనం బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.
IND vs AFG: ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ ఎంట్రీ.. కీలక అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్..!
Vaibhav sooryavanshi: అఫ్గానిస్థాన్ (Afghanistan) జట్టుతో ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టీ20లో భారత క్రికెట్ జట్టు (Team India) ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది.
సిరీస్ విజయం ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ సెప్టెంబర్ 19న జరిగే ఆఖరి మ్యాచ్‌పై పడింది. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో చోటు దక్కించుకోలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తుది జట్టులోకి రావడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రెండో మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాట్లాడిన తీరు చూస్తే బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.
పరిస్థితులకు అలవాటు పడేందుకు, ప్రాక్టీస్ లభించేందుకు ఇంతవరకు బరిలోకి దిగని క్రికెటర్లకు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు కెప్టెన్ వెల్లడించారు. ఈ క్రమంలో వైభవ్ పునరాగమనం దాదాపు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే ప్రస్తుత ఓపెనర్ల ఫామ్ మేనేజ్మెంట్కు పెను సవాలుగా మారింది.
అభిషేక్ శర్మ (Abhishek Sharma) 237.25 స్ట్రైక్ రేట్‌తో 121 పరుగులు సాధించి సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు రెండో టీ20లో సంజూ శాంసన్ (Sanju Samson) కేవలం 22 బంతుల్లోనే 57 రన్స్ బాది దంచికొట్టాడు.
టాప్ ఆర్డర్ ఇంత పటిష్టంగా ఉన్న వేళ ఎవరి స్థానంలో మార్పు చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. అయినప్పటికీ సిరీస్ చేతికి రావడంతో భారత్ ప్రయోగాలకు వెనుకాడకపోవచ్చు. వైభవ్ సూర్యవంశీ తన గత జింబాబ్వే పర్యటనలో మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసి అదరగొట్టాడు.
ఆఖరి మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 81 రన్స్ సాధించి అద్భుత ఫామ్‌ను కనబరిచారు. 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉన్న టీమిండియా, ఈ కుర్రాడికి మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలని భావిస్తే అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.




