Bumrah vs Vaibhav: ఏం గుండెరా అది.. వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్!

Bumrah vs Vaibhav: వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రాను ఎదుర్కొనేంత సీన్ వైభవ్‌కు లేదని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చెలరేగాడు. బుమ్రాకే చుక్కలు చూపించాడు.

Rishvik
Published on: 8 April 2026 10:17 AM IST
Bumrah vs Vaibhav
X

Bumrah vs Vaibhav: ఏం గుండెరా అది.. వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్!

Bumrah vs Vaibhav: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గౌహతిలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య పోరు పైనే ఉంది. వరల్డ్ క్లాస్ బౌలర్ బుమ్రాను ఎదుర్కొనేంత సీన్ వైభవ్‌కు లేదని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చెలరేగాడు. బుమ్రాకే చుక్కలు చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించినప్పటికీ.. మైదానంలో ఉత్కంఠ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు రాగా.. తొలి బంతినే వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్‌ బాదాడు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడమే కష్టం. అలాంటిది మొదటి బంతికి, అందులోనూ 15 ఏళ్ల కుర్రాడు అంటే మాటలు కాదు. కానీ వైభవ్ సునాయాసంగా లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ బాదేశాడు. ఈ షాట్ చూసిన బుమ్రా చిరునవ్వుతో బౌలింగ్ చేయడనికి వెళ్ళిపోయాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతిని కూడా వైభవ్ మరో సిక్సర్‌గా మలిచాడు. ఈసారి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు బంతిని పంపించాడు. ఇలా వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఈ యువ ఆటగాడు బుమ్రాపై ఆధిపత్యం చెలాయించాడు. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏం గుండెరా అది అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ సిక్సులు బాదాడు. చివరకు శార్దూల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వైభవ్ ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 39 రన్స్ బాదాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ (77 నాటౌట్ ; 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. దాంతో రాజస్థాన్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 123/9కి పరిమితమైంది. రూథర్‌ఫోర్డ్ (25), నమన్ ధీర్ (25) టాప్ స్కోరర్లు. ముంబై స్టార్స్ ర్యాన్ రికెల్టన్ (8), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6), తిలక్ వర్మ (14), హార్దిక్ పాండ్య (9) నిరాశపర్చారు.



Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story