Vaibhav Sooryavanshi: వైభవ్ వైఫల్యం వెనక ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. ఇది మాములు స్కెచ్ కాదయ్యో!
Vaibhav Sooryavanshi: Adil Rashid Reveals England's Master Plan Against Vaibhav Sooryavanshi. ఎన్నో అంచనాల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
Vaibhav Sooryavanshi: వైభవ్ వైఫల్యం వెనక ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. ఇది మాములు స్కెచ్ కాదయ్యో!
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో రికార్డులు బద్దలు కొడుతూ సంచలన ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌లలో 776 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ 15 ఏళ్ల యువ సంచలనం 48.50 సగటు, 237.31 స్ట్రైక్ రేట్‌తో 'ఆరెంజ్ క్యాప్'ను గెలుచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుడ్డోడు.. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మెరుపు ఆరంభాలు చేసినప్పటికీ.. వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చడంలో విఫలమవుతున్నాడు. అయితే ఇందుకు కారణం ఇంగ్లండ్ జట్టు ముందుగానే రూపొందించిన ప్రత్యేక వ్యూహం. ఈ విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వెల్లడించాడు.
ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్‌లను ఇంగ్లండ్ జట్టు క్షుణ్ణంగా పరిశీలించిందని ఆదిల్ రషీద్ తెలిపాడు. బుడ్డోడు ఏ బంతులకు ఇబ్బంది పడతాడు, ఏ ప్రాంతాల్లో బలహీనంగా ఉంటాడనే విషయాలను డేటా ఆధారంగా విశ్లేషించామని, అదే ప్రణాళికను మైదానంలో అమలు చేశామని వెల్లడించాడు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త. కానీ ఐపీఎల్‌లో అతని ఆటను అందరూ చూశారు. అతని బలాలు, బలహీనతలపై మా జట్టు పూర్తిగా అధ్యయనం చేసింది. ఆ ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేశాం. వైభవ్ మాత్రమే కాదు.. టీమిండియా ప్రతి ఆటగాడికి మా వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉంది. వైభవ్ విషయంలో అయితే ఇంకాస్త ఎక్కువగా ఆలోచించాం' అని రషీద్ పేర్కొన్నాడు.
ఈ సిరీస్‌లో వైభవ్ ఇప్పటివరకు 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ టాప్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బుడ్డోడికి పెద్ద సవాల్‌గా మారాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లోనూ, బ్రిస్టల్‌లోనూ ఆర్చర్ బౌలింగ్‌లోనే వైభవ్ ఔటయ్యాడు. బ్రిస్టల్ టీ20లో జోష్ టంగ్ బౌలింగ్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ బాది మంచి ఆరంభం చేసిన వైభవ్.. ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. సూర్యవంశీకి భారత జట్టు సరైన స్వేచ్ఛ ఇచ్చిందని ఆదిల్ రషీద్ అభిప్రాయపడ్డాడు. అతడిని సహజసిద్ధమైన దూకుడు ఆటనే కొనసాగించమని ప్రోత్సహించడం సరైన నిర్ణయమేనని చెప్పాడు.
'భారత జట్టు సూర్యవంశీకి తన సహజ శైలిలో ఆడే అవకాశం ఇచ్చింది. అది మంచి విషయమే. అయితే భవిష్యత్తులో ప్రపంచంలోని వివిధ పరిస్థితుల్లో ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఫామ్ లేమితో ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితులకు అనుగుణంగా తన ఆటలో మార్పులు చేసుకోవడం అతడు నేర్చుకోవాలి. అదే వైభవ్ ఎదుగుదలకు కీలకం' అని రషీద్ సూచించాడు.
ఐపీఎల్ 2026లో అసాధారణ ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించిన సూర్యవంశీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇంగ్లండ్ బౌలర్లు అతనిపై ప్రత్యేక వ్యూహంతో బౌలింగ్ చేయడంతో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న వైభవ్‌కు ఇది మంచి అనుభవంగా మారనుంది. సరైన మార్పులు చేసుకుంటూ ముందుకు సాగితే భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.




