Vaibhav Sooryavanshi: ఫైనల్‌కు కొద్ది గంటలే.. కట్‌చేస్తే.. వైభవ్, తిలక్ వర్మకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..?

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ ప్రస్తుతం టీమిండియా టెస్టు ప్రణాళికల్లో లేరని నివేదికలు వస్తున్నాయి. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు ఈ ఇద్దిరకి బీసీసీఐ షాకిచ్చింది.

Venkat
Published on: 5 Sept 2026 6:42 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: ఫైనల్‌కు కొద్ది గంటలే.. కట్‌చేస్తే.. వైభవ్, తిలక్ వర్మకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..?

Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ ప్రస్తుతం జాతీయ టెస్టు ప్రణాళికల్లో లేరని ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలో జరిగే దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈ ఇద్దరూ వరుసగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ తరపున బరిలోకి దిగనున్నారు. సెమీఫైనల్స్‌లో ఇద్దరూ బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. వైభవ్ సెంట్రల్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా, తిలక్ వర్మ నార్త్ జోన్‌పై 116 పరుగుల శతకంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, రెడ్‌బాల్ క్రికెట్‌లో మరింత స్థిరమైన ప్రదర్శన అవసరమని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

వైభవ్‌కు మరింత ఫస్ట్‌క్లాస్ అనుభవం అవసరం..

15 ఏళ్ల వైభవ్ ఇప్పటికే భారత్ తరపున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని అనుభవం పరిమితమే. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 15 ఇన్నింగ్స్‌ల్లో 347 పరుగులు చేశాడు. సగటు 23.33గా ఉంది. రెండు అర్ధశతకాలు నమోదు చేసినప్పటికీ తొలి ఫస్ట్‌క్లాస్ శతకం కోసం ఎదురుచూస్తున్నాడు. టెస్టు స్థాయికి చేరుకోవాలంటే రెడ్‌బాల్ క్రికెట్‌లో మరింత అనుభవం, స్థిరత్వం సాధించాల్సి ఉందని నివేదిక పేర్కొంది.

తిలక్‌ గణాంకాలు మెరుగ్గా ఉన్నా..

తిలక్ వర్మకు మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బలమైన రికార్డు ఉంది. 24 మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 1,729 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది శతకాలు, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 55.75. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్ జోన్ 80/5తో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శతకంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story