SRH vs RR: నన్ను జట్టు నుంచి ఎందుకు తీసేశారంటే.. వైభవ్ చాలా బాధపడ్డాడు!
SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.
SRH vs RR: నన్ను జట్టు నుంచి ఎందుకు తీసేశారంటే.. వైభవ్ చాలా బాధపడ్డాడు!
SRH vs RR: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఈ యువ బ్యాటర్ మెగా టోర్నీలో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తూ.. తన ప్రతిభను చాటుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు బాదిన వైభవ్.. తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు. రాజస్థాన్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లలో వైభవ్ వరుసగా 52, 31, 39, 78 స్కోర్లు బాదాడు. బుడ్డోడి దూకుడు ఇన్నింగ్స్‌లతో రాజస్థాన్ వరుస మ్యాచ్‌లు గెలిచింది.
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. ముందుగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయగా.. ఆపై రాజస్థాన్ చేధనకు దిగింది. 24 ఏళ్ల ప్రఫుల్ హింగే ఇన్నింగ్స్ రెండో బంతికే సూర్యవంశీ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే వైభవ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై రాజస్థాన్ రాయల్స్ అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్పందిస్తూ.. ఇది పూర్తిగా టీమ్ కాంబినేషన్ కారణంగానే తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. వైభవ్ ఫీల్డింగ్‌కు కూడా ఎంతో ఆసక్తి చూపుతాడని, గత మ్యాచ్‌లో రాజస్థాన్ తుది జట్టులో లేకపోవడంతో ఫీల్ అయ్యాడని చెప్పాడు.
'సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. టీమ్ కాంబినేషన్ కారణంగానే నిర్ణయం తీసుకున్నాం. ఫీల్డింగ్ చేయలేకపోవడం వైభవ్‌కు నచ్చలేదు. ఫీల్డింగ్‌కు కూడా ఎంతో ఆసక్తి చూపుతాడు. అతడు మంచి ఫీల్డర్. అయితే జట్టు సమతౌల్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డోనోవన్ ఫెర్రేరా ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయి జట్టులోకి రావడంతో వైభవ్ ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు' అని ట్రెవర్ పెన్నీ స్పష్టం చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ విజయయాత్రకు బ్రేక్ వేసింది. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ వైపు నడిపించాడు. హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 40 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 28 పరుగులు, సలీల్ అరోరా 13 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేసి జట్టుకు భారీస్ స్కోర్ అందించారు.
రాజస్థాన్ తరఫున జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రాజస్థాన్ నాలుగు మ్యాచ్‌ల విజయ పరంపరకు బ్రేక్ పడింది.




