Cricket: వైభవ్ ట్రిపుల్ సెంచరీ కచ్చితంగా కొడతాడు.. కుండబద్దలు కొట్టిన కోచ్.!
Cricket: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు చేసి రికార్డులు సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు ట్రిపుల్ సెంచరీ కూడా చేస్తాడని, రికార్డుల గురించి ఆలోచించకుండా బంతిని బలంగా బాదడంపైనే దృష్టి పెడతాడని ఆయన చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా అన్నారు.
Cricket: వైభవ్ ట్రిపుల్ సెంచరీ కచ్చితంగా కొడతాడు.. కుండబద్దలు కొట్టిన కోచ్.!
Vaibhav Suryavanshi: యూఏఈ మ్యాచ్‌లో బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను ఆయన చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా కొనియాడారు. వైభవ్ డబుల్ సెంచరీ చేస్తాడని తాను ఎప్పుడో ఊహించినట్లు తెలిపారు. అంతేకాదు ఏదో ఒకరోజు ట్రిపుల్ సెంచరీ చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రజెంట్ వైభవ్ నెలకొల్పుతున్న రికార్డులను అతడే బద్దలు కొట్టగలడన్నారు. రికార్డుల గురించి ఆలోచించకుండా బంతిని బలంగా బాదడంపైనే వైభవ్ దృష్టి పెడతాడని కోచ్ వెల్లడించారు.
దోహాలో యూఏఈతో జరిగిన గ్రూప్ బీ మ్యాచ్‌లో వైభవ్ 53 బంతుల్లో 204 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎ జట్టు 14.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 254 పరుగులతో ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ ఎ జట్టు సెమీఫైనల్‌కు చేరింది.
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ లిస్ట్ ఏ క్రికెట్లో 28 బంతుల్లోనే సెంచరీ చేసి, ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (29 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసి వేగవంతమైన లిస్ట్ ఏ డబుల్ సెంచరీ రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు కొట్టడం కూడా సీనియర్ పురుషుల ప్రొఫెషనల్ క్రికెట్లో ఒక కొత్త ప్రపంచ రికార్డు. అతడి స్ట్రైక్ రేట్ 384.90.
మ్యాచ్‌కు ముందు వైభవ్ నలుగురితో మాట్లాడినట్లు చెప్పాడు. తన తండ్రి, చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా, అండర్-19 నుంచి స్నేహితుడు ప్రథమ్ జాచక్, యువరాజ్ సింగ్‌తో మాట్లాడానని బీసీసీఐ వెబ్‌సైట్‌కు తెలిపాడు. యువరాజ్‌తో దాదాపు అరగంట మాట్లాడినట్లు చెప్పాడు. ఆ మ్యాచ్‌కు ముందు వైభవ్ ఈ టోర్నీలో తక్కువ స్కోర్లు చేశాడు. దోహా పిచ్‌ను చూశాక 'నా బలాలను నమ్మాను' అని అన్నాడు.
మనీశ్ ఓజా వైభవ్‌ను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోనీలతో సమానంగా 'జనరేషనల్ ప్లేయర్' అని అభివర్ణించారు. అంత చిన్న వయసులో ప్రతి స్టాటిస్టిక్ వరల్డ్ రికార్డే అని ఆయన అన్నారు. వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయగల సామర్థ్యం ఉన్నవాడని, భారత సీనియర్ జట్టులో క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలని కోచ్ మేనేజ్మెంట్ను కోరారు.




