vaibhav suryavanshi: మ్యాచ్‌కి ముందు వైభ‌వ్‌ సూర్య‌వంశీ ఏం చూస్తాడో తెలుసా.? ఫ‌న్నీ స‌మాధానం

vaibhav suryavanshi: ఐపీఎల్‌లో త‌న‌దైన ఆట‌తీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు వైభ‌వ్ సూర్య‌వంశ‌కీ. 14 ఏళ్ల‌కే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ చిచ్చ‌ర పిడుగు స్టేడియంలోప‌లే కాకుండా త‌న వ్యాఖ్య‌ల‌తో బ‌య‌ట కూడా సంద‌డి చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Mokshith
Published on: 23 April 2026 12:38 PM IST
vaibhav suryavanshi
X

vaibhav suryavanshi

vaibhav suryavanshi: ఐపీఎల్‌లో త‌న‌దైన ఆట‌తీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు వైభ‌వ్ సూర్య‌వంశ‌కీ. 14 ఏళ్ల‌కే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ఈ చిచ్చ‌ర పిడుగు స్టేడియంలోప‌లే కాకుండా త‌న వ్యాఖ్య‌ల‌తో బ‌య‌ట కూడా సంద‌డి చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

చిన్న వయసులోనే సంచలనం

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ చాలా చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిని కొనుగోలు చేసినప్పుడు అతని వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. 14 ఏళ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఇప్పుడు అతని వయసుకంటే అతని ఆటతీరు గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. తొలి సీజన్‌లోనే 35 బంతుల్లో శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిగా ఇదే వేగవంతమైన శతకం. 2026 సీజన్‌లో కూడా అదే దూకుడు చూపిస్తున్నాడు.

“ఇంకా కార్టూన్లు చూస్తున్నా…” – వైరల్ వీడియో

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ తర్వాత వైభవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. ప్రెజెంటర్ సరదాగా, “మేము నీ వయసులో కార్టూన్లు చూస్తుంటే, నువ్వు బౌలర్లను కార్టూన్ చేస్తున్నావు” అని అన్నాడు. దీనికి వైభవ్ సింపుల్‌గా స్పందించాడు. “నా తలలో పెద్దగా ఏమీ ఉండదు సర్. ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్ చూస్తా. ఆ అలవాటు ఇంకా ఉంది. కానీ ఆటపై ఫోకస్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చే మ్యాచ్‌పై దృష్టి పెట్టి రెండు పాయింట్లు సాధించాలి” అని చెప్పాడు.

మ్యాచ్‌లో నిరాశ… కానీ జట్టు విజయం

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ పెద్దగా రాణించలేకపోయాడు. 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ముఖ్యంగా బౌలర్ మొహ్సిన్ ఖాన్ వేసిన ఐదు వరుస డాట్ బాల్స్ అతడిపై ఒత్తిడి తెచ్చాయి. చివరి బంతికి పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు.

అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రత్యర్థి జట్టును 119 పరుగులకే కట్టడి చేశారు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసి మెరిశాడు. నాండ్రే బర్గర్, బృజేష్ శర్మ తలా 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా 43 పరుగులతో పాటు ఒక వికెట్ తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story