Varun Chakaravarthy: బుడ్డోడి వికెట్ తీశాడు, ఐపీఎల్‌లో రేర్ రికార్డు పట్టాడు!
Varun Chakaravarthy: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేశాడు.
Varun Chakaravarthy: బుడ్డోడి వికెట్ తీశాడు, ఐపీఎల్‌లో రేర్ రికార్డు పట్టాడు!
Varun Chakaravarthy: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 19) రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ సంచలనం, బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వికెట్ పడగొట్టడంతో.. చక్రవర్తి ఖాతాలో 200వ వికెట్ చేరింది. దాంతో టీ20ల్లో 200 వికెట్లు తీసిన 20వ భారత బౌలర్‌గా, అలాగే ఈ అరుదైన మార్క్‌ను చేరుకున్న 10వ భారత స్పిన్నర్‌గా రికార్డుల్లో నిలిచాడు. వరుణ్ క్రమశిక్షణ, నిలకడైన ప్రదర్శన ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాలి.
టీ20 క్రికెట్‌లో 155 మ్యాచ్‌లలో వరుణ్ చక్రవర్తి 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న రెండో భారత బౌలర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు 151 మ్యాచ్‌లలో 200 వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చక్రవర్తి కేకేఆర్ తరఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ తరఫున 100 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్‌లు వరుణ్ కంటే ముందున్నారు. ఐపీఎల్‌లో 89 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు పడగొట్టిన చక్రవర్తి.. భారత్ తరఫున 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు.
రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 14 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశి (46), ధ్రువ్ జురెల్ (5), రియాన్ పరాగ్ (12)లను ఔట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో వైభవ్, జైస్వాల్ (39) అద్భుతంగా ఆడుతూ 63 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే కోల్‌కతా బౌలర్లు చెలరేగి కేకేఆర్ పరుగుల వరదకు బ్రేక్ వేశారు. చివరి ఓవర్లలో రాజస్థాన్ బ్యాటింగ్ కుప్పకూలి తక్కువ స్కోరుతో ఇన్నింగ్స్ ముగిసింది.




