TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సెన్సేషన్‌.. కేకేఆర్ స్టార్ స్పెషల్ మెసేజ్!

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్‌కి వరుణ్ చక్రవర్తి అభినందనలు తెలిపాడు.

Rishvik
Published on: 4 May 2026 7:15 PM IST
TVK Vijay
X

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సెన్సేషన్‌.. కేకేఆర్ స్టార్ స్పెషల్ మెసేజ్!

TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన 'టీవీకే' సత్తా చాటుతూ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. పార్టీ అధినేత, అగ్ర కథానాయకుడు విజయ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచారు. పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌లో భారీ మెజారిటీతో విజయ్‌ విక్టరీ కొట్టారు. టీవీకే పార్టీ తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో చేయగా.. 75 స్థానాలు గెలుచుకుంది.

ఇంకా 33 స్థానాల్లో ముందంజలో ఉంది. విజయ్‌ సెంచరీ కొట్టడం ఖాయం. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా.. మిగతా పార్టీలతో కలిసి విజయ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. టీవీకే ఘన విజయంతో సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు ప్రారంభమయ్యాయి. సెలబ్రిటీలు విజయ్‌ విజయంను ప్రశంసిస్తూ.. పోస్ట్‌లు పెడుతున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్‌, టీవీకే పార్టీకి టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్‌తో కలిసి ఉన్న పాత ఫొటోను షేర్ చేస్తూ.. 'అన్నా' అని క్యాప్షన్ పెట్టాడు. లవ్, హగ్ సింబల్ జత చేశాడు.

మీ బలం ఏంటో చూపావు అన్న అంటూ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. వరుణ్ గతంలో విజయ్‌తో పాటు లెజెండరీ నటుడు రజినీకాంత్ కు కూడా తాను పెద్ద అభిమానినని వెల్లడించాడు. వరుణ్ తమిళనాడు క్రికెటర్ అన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ 2026లో ఆడుతున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రారంభ దశలో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టమయిందని చెప్పాడు. అయితే టోర్నీ ముందుకు సాగేకొద్దీ పిచ్‌లు మారుతూ స్పిన్నర్లకు అనుకూలంగా మారాయని వివరించాడు. సన్‌రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడని,

అతని రిథమ్‌ను బ్రేక్ చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ప్రారంభ మ్యాచ్‌లలో వికెట్లు పడగొట్టలేకపోయిన వరుణ్.. తర్వాతి మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తూ తన ఫామ్‌ను తిరిగి సంపాదించాడు. గత నాలుగు మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసి జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు. కేకేఆర్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్లు క్రమంగా మెరుగుపడు తున్నాయని, ఇదే ఫామ్ కొనసాగితే ఐపీఎల్‌లో పెద్ద ప్రభావం చూపగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story