Virat Kohli: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. అత్యధిక ఫోర్లు

Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో గొప్ప మైలు రాయిని చేరుకున్నాడు.

Mokshith
Published on: 25 April 2026 3:21 PM IST
Virat Kohli
X

Virat Kohli

Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో గొప్ప మైలు రాయిని చేరుకున్నాడు. ఇంతకీ కోహ్లీ సాధించిన ఆ ఘనత ఏంటి.? దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నాడు. ఈ టోర్నీలో 800 ఫోర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 266 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును అందుకోవడం విశేషం. ఇప్పటికే పరుగుల పరంగా కూడా అగ్రస్థానంలో ఉన్న అతడు, ఇప్పుడు ఫోర్ల విషయంలో కూడా టాప్‌లో నిలిచాడు.

టాప్-5లో ఎవరు ఉన్నారు?

ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉండ‌గా.. అతని తర్వాత రెండో స్థానంలో శిఖార్ ధావ‌న్ ఉన్నాడు. ధావన్ తన కెరీర్‌లో 768 ఫోర్లు సాధించాడు. మూడో స్థానంలో డేవిడ్ వార్న‌ర్ (663 ఫోర్లు) ఉన్నాడు. నాలుగో స్థానంలో రోహిత్ శ‌ర్మ (653 ఫోర్లు) నిలిచాడు. ఇక ఐదో స్థానంలో ర‌హానే (522 ఫోర్లు) ఉన్నాడు.

500+ ఫోర్లు క్లబ్‌లో ఇంకెవ‌రు?

ఈ జాబితాలో టాప్-5లో లేకపోయినా, 500కి పైగా ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో సురేశ్ రైనా కూడా ఉన్నాడు. అతను ఐపీఎల్‌లో మొత్తం 506 ఫోర్లు సాధించాడు. ఇది ఐపీఎల్‌లో దీర్ఘకాలం స్థిరంగా ఆడిన ఆటగాళ్ల ప్రతిభను చూపించే గణాంకంగా చెప్పొచ్చు.

అద్భుత ఫామ్‌లో కోహ్లీ

ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అతడు 33 ఫోర్లు కొట్టి టాప్‌లో కొనసాగుతున్నాడు. అతని తర్వాత రెండో స్థానంలో సంజూ సామ్‌స‌న్‌ ఉన్నాడు. సామ్‌సన్ ఇప్పటివరకు 31 ఫోర్లు కొట్టాడు. ఇలా చూస్తే కోహ్లీ ఫామ్ కొనసాగుతుండటం అతని స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం అని చెప్పొచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story