Virat Kohli: విరాట్ నిజంగానే ఆమె ఫొటోకు లైక్ కొట్టాడా.? ఇప్పుడిదే రచ్చ
Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా వార్తే. మైదానంలో రికార్డులు సృష్టించినా, సోషల్ మీడియాలో చిన్న యాక్టివిటీ చేసినా చర్చ మొదలవుతుంది.
Virat Kohli
Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా వార్తే. మైదానంలో రికార్డులు సృష్టించినా, సోషల్ మీడియాలో చిన్న యాక్టివిటీ చేసినా చర్చ మొదలవుతుంది. తాజాగా కోహ్లీ చేసిన ఒక “లైక్” సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. జర్మనీకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ ఫోటోపై ఆయన లైక్ కొట్టిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.?
జర్మనీకి చెందిన సోషల్ మీడియా క్రియేటర్ లిజ్లాజ్ జనవరి 30న తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్యాస్తమయం సమయంలో తీసిన ఫోటోలను పోస్ట్ చేసింది. “గోల్డెన్ అవర్” అంటూ షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఒకదానికి కోహ్లీ లైక్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇది బయటపడిన వెంటనే స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కూడా కోహ్లీ లైక్ చేసిన కొన్ని పోస్టులు ఇదే విధంగా చర్చకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అభిమానులు “ఇది అల్గారిథమ్ కారణంగా జరిగిన పొరపాటు” అని చెప్పి విషయాన్ని కూల్ చేశారు. ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తోంది.
చాహల్ స్టైల్ రియాక్షన్
ఈ ఘటనపై టీమిండియా స్పిన్నర్ చాహల్ తనదైన కామెడీ స్టైల్‌లో స్పందించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్లకు స్పందిస్తూ “అల్గారిథమ్” అనే పదంతో ఎమోజీ పెట్టాడు. చాహల్ రిప్లై సైతం తెగ వైరల్ అవుతోంది. కోహ్లీతో అతనికి ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే కాబట్టి, ఇది సరదాగా చేసిన కామెంట్ అని అందరూ భావిస్తున్నారు.
ఇంతకీ ఎవరీ లిజ్లాజ్.?
లిజ్లాజ్ జర్మనీకి చెందిన వ్లాగర్, సింగర్. ఆమె సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆమె పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇదే సమయంలో ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఫ్యాన్ అని, కోహ్లీ అంటే ఇష్టం అని చెప్పింది. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగి ఉండొచ్చు.?
అయితే ఈ విషయంపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “స్క్రోల్ చేస్తూ పొరపాటున లైక్ అయ్యి ఉండొచ్చు” అని కొందరు అంటుంటే.. మరికొందరు “ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను కోహ్లీ చూస్తుంటారు, అందులో భాగంగానే లైక్ అయి ఉండొచ్చు” అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక చిన్న లైక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.




