2027 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ ప్లేస్‌లకు నో గ్యారెంటీ? బీసీసీఐ కీలక వ్యాఖ్యలు!
2027 World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా అన్న చర్చకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఇద్దరిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
2027 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ ప్లేస్‌లకు నో గ్యారెంటీ? బీసీసీఐ కీలక వ్యాఖ్యలు!
2027 World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌నకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపికపై ఇప్పుడే ఎలాంటి హామీ ఇవ్వలేమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే ఇద్దరిలోనూ ఇంకా క్రికెట్ మిగిలి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తుది నిర్ణయం మాత్రం సెలక్షన్ కమిటీదేనని పేర్కొన్నారు. దీంతో భారత వన్డే జట్టులో ఈ ఇద్దరు దిగ్గజాల భవిష్యత్తుపై చర్చ మళ్లీ మొదలైంది.
కోహ్లీకి ఫామ్ కలిసొస్తోందా..
విరాట్ కోహ్లీకి ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో అతడు సగటు 48తో పరుగులు సాధించడంతోపాటు ఓ అర్ధశతకం నమోదు చేశాడు. ఐపీఎల్ 2026 (IPL 2026)కు ముందు జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో 3 ఇన్నింగ్స్‌ల్లో 80.00 సగటుతో రాణించాడు. అందులో ఓ సెంచరీతో పాటు 91 బంతుల్లో 93 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది.
రోహిత్‌పై కొనసాగుతున్న సందేహాలు..
మరోవైపు రోహిత్ శర్మ విషయంలో మాత్రం ఎంపికపై ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఫిట్‌నెస్, ఇటీవలి ఫామ్ కారణంగా అతడి స్థానంపై చర్చ జరుగుతోంది. వన్డే ఓపెనర్‌గా మ్యాచ్‌ను గెలిపించే స్థాయి ప్రభావాన్ని రోహిత్ ఇంకా చూపించగలడా అనే అంశంపై బీసీసీఐ వర్గాల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
సెప్టెంబరులో మళ్లీ బరిలోకి..?
కోహ్లీ, రోహిత్ చివరిసారిగా 2026 జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ తరఫున ఆడారు. అనంతరం భారత్ ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20ఐ సిరీస్, 2026 ఆసియా క్రీడల్లో పాల్గొననుండటంతో ఇద్దరూ సెప్టెంబర్ చివరి వరకు విశ్రాంతిలో ఉండనున్నారు.
ప్రపంచకప్‌కు ముందు కీలక సిరీస్‌లు..
సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, 2027 జనవరిలో జింబాబ్వేతో వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్‌లు 2027 ప్రపంచ కప్‌ను ముందు కోహ్లీ, రోహిత్ అవకాశాలను అంచనా వేయడంలో కీలకం కానున్నాయి. అయితే ప్రస్తుతం వారి ఎంపికపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.




