Virat Kohli: లండన్‌లో విరాట్ కోహ్లీ రహస్య ఫొటోలు వైరల్!
Virat Kohli’s secret photos from London went viral. విరాట్ కోహ్లీతో లండన్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను జోర్డాన్ కాక్స్ వెల్లడించాడు.
Virat Kohli: లండన్‌లో విరాట్ కోహ్లీ రహస్య ఫొటోలు వైరల్!
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్వరలోనే మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 600కు పైగా పరుగులు చేసిన కింగ్.. ఆర్సీబీ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ అనంతరం తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. ముందుగా జట్టులోకి ఎంపికైనా.. ఫిట్‌నెస్ లేకపోవడంతో జట్టు నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై 14న బర్మింగ్‌హామ్‌లో జరిగే తొలి వన్డేలో కింగ్ ఆడనున్నాడు.
వన్డే సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ జోర్డాన్ కాక్స్.. విరాట్ కోహ్లీతో లండన్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా వెల్లడించాడు. గత నెలలో లండన్‌లో కోహ్లీని కలిసిన కాక్స్.. అతడితో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసిన కాక్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాము ఎవరి దృష్టిలో పడకుండా సాధారణ జీవితం గడపాలని ప్రయత్నించినప్పటికీ.. తమకు తెలియకుండానే ఎవరో ఫొటోలు తీశారని కాక్స్ తెలిపాడు. 'లండన్‌లో నేను, కోహ్లీ కలిశాం. మా పక్క నుంచి వందల మంది వెళ్లినా ఎవరూ ఆగలేదు. ఎవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఓ రెండు గంటల తర్వాత కోహ్లీ నాకు మెసేజ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు చూశావా? అని అడిగాడు. ఆ ఫొటోలు ఎలా బయటకు వచ్చాయో తెలియక నేను షాక్‌కు గురయ్యా' అని కాక్స్ చెప్పాడు.
'విరాట్ కోహ్లీ లాంటి స్టార్‌కు సాధారణ జీవితం గడపడం ఎంత కష్టమో ఈ సంఘటన ద్వారా అర్థమైంది. కోహ్లీ ఎవరి దృష్టిలో పడకుండా సరదాగా గడుపుతూ సాధారణ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు. కానీ అతడి స్థాయిలో ఉన్న వ్యక్తికి అది ప్రతిసారీ సాధ్యం కాదు' అని జోర్డాన్ కాక్స్ తెలిపాడు. ఐపీఎల్ 2026లో కోహ్లీ నుంచి తనకు లభించిన సహకారం గురించి కాక్స్ ప్రత్యేకంగా వివరించాడు. 'క్రికెట్‌లో ఎన్నో గొప్ప విజయాలు సాధించినప్పటికీ యువ ఆటగాళ్ల కోసం విరాట్ కోహ్లీ ఎంతో సమయం కేటాయిస్తాడు. కొందరు ఆటగాళ్లు తమ ఆటపైనే దృష్టి పెడతారు. కానీ కోహ్లీ మాత్రం తన గురించి ఆలోచించే ముందు ఇతరులకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇలాంటి లక్షణం చాలా అరుదు. కోహ్లీ బెస్ట్ బ్యాటర్' అని కాక్స్ కొనియాడాడు.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ సేన 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు రాత్రి సౌతాంప్టన్‌లో జరగనుంది. టీ20 సిరీస్ అనంతరం వన్డే సిరీస్ జరగనుంది. వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ పునరాగమనం చేయనున్నాడు. కింగ్ బరిలోకి దిగనుండడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడనున్నాడు. కుమారుడు పుట్టునప్పటినుంచి విరాట్ లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.




