Virat Kohli: ఈ గణాంకాలు ఏంది సామి.. కింగ్ 2027 వరల్డ్ కప్ ఆడటం ఖాయం!

Virat Kohli continues his sensational ODI form with another fifty. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి క్లాస్ బ్యాటింగ్ చేశాడు.

Rishvik
Published on: 16 July 2026 8:44 PM IST
Virat Kohli
X

Virat Kohli: ఈ గణాంకాలు ఏంది సామి.. కింగ్ 2027 వరల్డ్ కప్ ఆడటం ఖాయం!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి క్లాస్ బ్యాటింగ్ చేశాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ బాదాడు. 66 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. దాంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది. అయితే కింగ్ గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని స్పష్టమవుతోంది. ఈ ప్రదర్శనతో వన్డే ప్రపంచ కప్ 2027లో కోహ్లీ ఆడుతాడు అనే చర్చ మళ్లీ మొదలైంది.

గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ వరుసగా 74, 135, 102, 65, 93, 23, 124, 5, 65 పరుగులు చేశాడు. ఈ 9 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, ఐదు అర్ధ శతకాలు బాదాడు. కేవలం రెండు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే కింగ్ పెద్ద స్కోరు చేయలేదు. మిగిలిన ప్రతి ఇన్నింగ్స్‌ల్లో జట్టుకు కీలకమైన పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. కోహ్లీ వంటి సీనియర్ అవసరం జట్టుకు ఎంతగానో ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.ఒత్తిడిని తట్టుకుని భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం, లక్ష్య ఛేదనలో అసాధారణ రికార్డు, కీలక మ్యాచ్‌ల్లో నిలకడైన ప్రదర్శన కోహ్లీని ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకరిగా నిలబెడుతున్నాయి.

ఇటీవల రోహిత్ శర్మ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం తన బ్యాట్‌తోనే సమాధానం ఇస్తున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అతడి ఫిట్‌నెస్, పరుగుల ఆకలి ఏమాత్రం తగ్గలేదని ఇటీవలి ఇన్నింగ్స్‌లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్‌ల్లో నమోదైన భారీ స్కోర్లు.. కింగ్ ఇంకా అత్యున్నత స్థాయిలో ఆడగలడని నిరూపిస్తున్నాయి. కోహ్లీ ఇదే స్థిరత్వాన్ని కొనసాగిస్తే 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో అతడి స్థానం ఖాయమే అని భారత క్రికెట్ వర్గాలు అంటున్నాయి. యువ ఆటగాళ్లతో పాటు అనుభవం కలిగిన సీనియర్‌గా కోహ్లీ జట్టుకు కీలక బలంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడి ఫామ్, ఫిట్‌నెస్, నిలకడను చూస్తుంటే.. 2027 ప్రపంచ కప్‌లో భారత జెర్సీలో మరోసారి విరాట్ కోహ్లీని చూడటం ఆశ్చర్యకరం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story