Cricket: తండ్రినే మించిపోయాడుగా.! 8 సిక్సర్లు, 19 ఫోర్లతో వీరేంద్రుడి కొడుకు విధ్వంసం..
Cricket: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ 143 బంతుల్లో 173 రన్స్ కొట్టి అదరగొట్టాడు.
Cricket: తండ్రినే మించిపోయాడుగా.! 8 సిక్సర్లు, 19 ఫోర్లతో వీరేంద్రుడి కొడుకు విధ్వంసం..
Cricket: భారతీయ క్రికెట్ రంగంలో దిగ్గజ ఆటగాళ్ల సంతానం మైదానంలో ప్రదర్శిస్తున్న ప్రతిభ ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తుంటుంది. ముఖ్యంగా అగ్రశ్రేణి ఆటగాళ్ల వారసులు దేశవాళీ అలాగే అండర్ 19 టోర్నమెంట్లలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ తాజాగా ఆడిన ఇన్నింగ్స్ క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన సాధించిన ఈ అరుదైన రికార్డుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ నిన్న జరిగిన మ్యాచ్లో 143 బంతుల్లో ఏకంగా 173 రన్స్ కొట్టి అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ ఈ ఇన్నింగ్స్ హైలైట్స్ను అధికారికంగా ట్వీట్ చేసింది. అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఆ యువ ఆటగాడు చండీగఢ్పై చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఆయన ఏకంగా 8 సెక్సులు, 19 ఫోర్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు ఆడిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మైదానంలో అతడు ప్రదర్శించిన బ్యాటింగ్ శైలి అందరి ప్రశంసలను అందుకుంటోంది. కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, కట్ షాట్, పుల్ షాట్లతో పాటు తన తండ్రి ట్రేడ్మార్కైన అప్పర్ కట్లతోనూ ఈ జూనియర్ సెహ్వాగ్ అలరించాడు. తండ్రిని పోలిన దూకుడుతో ఆయన బ్యాటింగ్ చేస్తుండటం విశేషం. దేశవాళీ టోర్నమెంట్లలో ఈ రకమైన ప్రదర్శనలు ఇస్తుండటం వల్ల సెలక్టర్ల దృష్టిని ఆయన త్వరలోనే ఆకర్షించే అవకాశం ఉంది. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఆడే సత్తా అతడికి ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




