Shubman Gill: అంపైర్‌తో గిల్ గొడవ..ఏం జరిగిందంటే..?

Shubman Gill: వెల్లింగ్టన్ తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూ డీఆర్ఎస్ వివాదం చర్చనీయాంశమైంది.

Gagan kumar
Published on: 19 Nov 2026 11:21 AM IST
Shubman Gill
X

Shubman Gill: అంపైర్‌తో గిల్ గొడవ..ఏం జరిగిందంటే..?

Wellington Test: వెల్లింగ్టన్ తొలి టెస్టులో గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చుట్టూ అల్లుకున్న డీఆర్ఎస్ డ్రామా మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వచ్చిన ఆ కీలక బంతికి నాటౌట్ రావడం, థర్డ్ అంపైర్ పాల్ రీఫెల్ తీసుకున్న నిర్ణయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసంతృప్తితో ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్తో మాట్లాడటం క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 31వ ఓవర్‌లో మూడో బంతిని బుమ్రా సంధించాడు.

బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లి నేరుగా ఫిలిప్స్ ప్యాడ్లకు తగిలింది.బంతి ప్యాడ్లకు తగలగానే బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఇతర భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా, అలాగే వికెట్ల పై నుంచి వెళ్లే అవకాశం ఉందా అనే అంశాలపై బుమ్రా సహచరులతో చర్చించాడు. చివరకు గిల్ డీఆర్ఎస్ రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

బంతి బ్యాట్ దగ్గరకు వచ్చిన క్షణంలో స్క్రీన్‌పై స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో బ్యాట్ అంచుకు తగిలి ఉండొచ్చనే కోణం తెరపైకి వచ్చింది. ముందు వైపు నుంచి చూపించిన రీప్లేలో బ్యాట్‌కు బంతి తగిలినట్లు స్పష్టత కనిపించలేదు.

మరో రీప్లేను నెమ్మదిగా పరిశీలించిన తర్వాత బంతి దిశలో స్వల్ప మార్పు ఉన్నట్లు గుర్తించి, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయానికే కట్టుబడ్డారు. రీప్లే వివరాల ప్రకారం బంతి వికెట్ల మీదుగా వెళ్లే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వినిపించింది. బ్యాట్‌కు తగిలిందా లేదా అనే అంశంతో పాటు బంతి ఎత్తు కూడా ఈ అప్పీల్‌లో కీలకంగా మారింది.

నిర్ణయం నాటౌట్‌గా ఖరారవడంతో భారత్ ఒక రివ్యూ కోల్పోయింది. బ్యాట్‌కు, బంతికి మధ్య ఖాళీ ఉందని, బంతి నేరుగా ప్యాడ్‌కు తగిలిందనే తన అభిప్రాయాన్ని గిల్ ఫీల్డ్ అంపైర్ ఇల్లింగ్‌వర్త్‌కు వివరించాడు. అంపైర్ తన వైపు కారణాలను చెప్పినప్పటికీ గిల్ సంతృప్తి చెందలేదని మ్యాచ్ దృశ్యాలు చూపించాయి.

కొద్దిసేపు చర్చ అనంతరం గిల్ తిరిగి ఫీల్డింగ్‌కు వెళ్లిపోయాడు. బుమ్రా ఖాతాలో మరో వికెట్ చేరే అవకాశం చేజారడమే కాకుండా, టెస్ట్ మ్యాచ్‌లో రివ్యూలను ఏ సందర్భాల్లో, ఎంత జాగ్రత్తగా వాడాలనే అంశంపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.