Sanju Samson: సంజు శాంసన్‌ను తప్పించడానికి కారణం ఏంటి?.. శ్రేయస్ సమాధానం ఇదే!
Sanju Samson: Why Was Sanju Samson Dropped. సంజు శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడానికి కారణాన్ని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
Sanju Samson: సంజు శాంసన్‌ను తప్పించడానికి కారణం ఏంటి?.. శ్రేయస్ సమాధానం ఇదే!
Sanju Samson: భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కీలక మార్పుతో బరిలోకి దిగింది. తొలి టీ20లో ఓపెనర్‌గా ఆడిన సంజు శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించి.. అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. వరుసగా తక్కువ స్కోర్లకే అవుటైన సంజు స్థానంలో వైభవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు శ్రేయాస్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమే అని, కానీ తప్పలేదని చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. 'మేము మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని తీసుకున్నాం' అని తెలిపాడు. దీంతో వరుస అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజుపై వేటు పడగా.. యువ బ్యాటర్‌కు అవకాశం దక్కింది. వైభవ్ ఎంపికపై మాట్లాడుతూ శ్రేయస్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'గత కొన్ని నెలలుగా వైభవ్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో అందరూ చూశారు. అత్యుత్తమ బౌలర్లపై కూడా ఎలాంటి భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నాడు. అతడిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది. అందుకే జట్టులో చోటుకు పూర్తిగా అర్హుడని మేము భావించాం' అని చెప్పాడు.
వైభవ్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా శ్రేయస్ స్పష్టం చేశాడు. 'వైభవ్ ఒత్తిడిని అస్సలు పట్టించుకోడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. నెట్స్‌లో బౌలర్లపై దూకుడుగా ఆడే తీరు చూస్తే అతడి వ్యక్తిత్వం ఎలా ఉందో అర్థమవుతుంది. రాబోయే మ్యాచ్‌ల్లో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో కూడా అతడికి బాగా తెలుసు' అని పేర్కొన్నాడు. భారత జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొనడం గురించి కూడా శ్రేయస్ స్పందించాడు. 'ప్రస్తుతం భారత క్రికెట్‌లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రతి మ్యాచ్‌కు జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. అదే మమ్మల్ని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతోంది. నా దృష్టిలో ఒత్తిడి అనేది ఒక అవకాశం లాంటిది. ఆ ఒత్తిడిని అధిగమించి రాణిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి' అని వ్యాఖ్యానించాడు.
ఇక రెండో టీ20లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో 15 సంవత్సరాల 99 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ భారత తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలిచిన వైభవ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే మొదటి మ్యాచ్‌లోనే బుడ్డోడు నిరాశపరిచాడు. 10 బంతుల్లో 14 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ తొలి మ్యాచ్‌లో వైభవ్ రెండు ఫోర్లు బాదాడు.




