గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆఫ్ఘాన్ సిరీస్ నుంచి శిష్యుడు ఔట్.. కొత్తగా ఎవరొచ్చారంటే?

Yash Thakur Replaces Harshit Rana: టీమిండియా టీ20ఐ జట్టులో కీలక మార్పు జరిగింది. హర్షిత్ రాణా గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20ఐ సిరీస్‌తో పాటు 2026 ఏషియన్ గేమ్స్ నుంచి వైదొలిగాడు.

Venkat
Published on: 10 Sept 2026 7:12 PM IST
Yash Thakur Replaces Harshit Rana
X

గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆఫ్ఘాన్ సిరీస్ నుంచి శిష్యుడు ఔట్.. కొత్తగా ఎవరొచ్చారంటే?

Yash Thakur Replaces Harshit Rana: టీమిండియా టీ20ఐ స్వ్కాడ్‌లో మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా హర్షిత్ రాణా అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌తో పాటు 2026 ఏషియన్ గేమ్స్ (2026 Asian Games)కు దూరమయ్యాడు. అతడి స్థానంలో విదర్భకు చెందిన పేసర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు BCCI వెల్లడించింది.

యశ్ ఠాకూర్‌కు మరో అవకాశం..

27 ఏళ్ల యశ్ ఠాకూర్ ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో అతడు రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శన తర్వాత ఇప్పుడు అతడికి మరోసారి టీమిండియా తరపున ఆడే అవకాశం దక్కింది.

రాణాకు మరోసారి గాయం..

హర్షిత్ రాణా గతంలోనూ గాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాజా సమస్యతో అతడు మరోసారి భారత జట్టుకు దూరమయ్యాడు. బీసీసీఐలో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల సమయంలో అతడికి గాయం అయినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

బుమ్రా సహా కీలక ఆటగాళ్లు..

మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందడంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ఐ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఏషియన్ గేమ్స్‌పైనా దృష్టి..

యశ్ ఠాకూర్ చేరికతో భారత టీ20ఐ టీంలో పేస్ బౌలింగ్ విభాగానికి మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అఫ్గానిస్థాన్ సిరీస్‌తో పాటు జపాన్‌లో జరిగే 2026 ఏషియన్ గేమ్స్ కోసం కూడా అతడిని ఎంపిక చేశారు. రాణా స్థానాన్ని భర్తీ చేయనున్న యశ్.. తనకు లభించిన ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story