Yashasvi Jaiswal: రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా ఉంది.. జైస్వాల్ వ్యాఖ్యలు!

Yashasvi Jaiswal: లక్నో మ్యాచ్‌కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యశస్వి వ్యవహరిస్తుండటం విశేషం.

Rishvik
Published on: 19 May 2026 7:44 PM IST
Yashasvi Jaiswal
X

Yashasvi Jaiswal: రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా ఉంది.. జైస్వాల్ వ్యాఖ్యలు!

Yashasvi Jaiswal: ఐపీఎల్‌ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జైపూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉందని భావించిన కెప్టెన్ యశస్వి జైస్వాల్ ఛేజింగ్‌కు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్‌కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా యశస్వి వ్యవహరిస్తుండటం విశేషం. రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ గాయం కారణంగా మ్యాచ్ ఆడడం లేదు.

టాస్ అనంతరం మాట్లాడిన యశస్వి జైస్వాల్.. ‘ఈ వికెట్ మంచి బ్యాటింగ్ ట్రాక్‌లా కనిపిస్తోంది. తర్వాత మంచు ప్రభావం ఉంటుందని భావిస్తున్నాం. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ఎంతో గర్వంగా ఉంది. జట్టు తరఫున ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. మా కెప్టెన్ రియాన్ పరాగ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం’ అని తెలిపాడు. జైపూర్‌లో ఇప్పటివరకు ఈ సీజన్‌లో విజయం సాధించలేకపోయిన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌తో ఆ చెత్త రికార్డును ముగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఆర్ఆర్ చూస్తోంది.

మరోవైపు లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘ఇది మంచి బ్యాటింగ్ వికెట్. టాస్ గెలిచినా మేము కూడా బ్యాటింగ్‌ ఎంచుకునే వాళ్లం. ఇంకా మాకు ఆడాల్సిన క్రికెట్ చాలా ఉంది. అభిమానుల కోసం ప్రతి మ్యాచ్‌ను గెలవాలనే తపనతో బరిలోకి దిగుతున్నాం’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ఎయిడెన్ మార్‌క్రమ్‌ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్థానంలో అయుష్ బదోని జట్టులోకి వచ్చాడు. అలాగే మహమ్మద్ షమీ స్థానంలో మొహ్సిన్ ఖాన్‌కు అవకాశం లభించింది. లక్నో ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిశక్రమించగా.. విజయంతో టోర్నీని ముగించాలని చూస్తోంది.

తుది జట్లు:

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్‌ (కెప్టెన్‌), ప్రెటోరియస్‌, ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌), ఫెరీరా, శుభమ్‌ దూబె, దాసున్‌ శనక, జోఫ్రా ఆర్చర్‌, సుశాంత్‌ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేశ్‌ శర్మ, యశ్‌ రాజ్‌ పుంజా.

లక్నో సూపర్‌ జెయింట్స్‌: మిచెల్‌ మార్ష్‌, జోష్‌ ఇంగ్లిస్‌, నికోలస్‌ పూరన్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), ఆయుష్‌ బదోని, అబ్దుల్‌ సమద్‌, షహబాజ్‌ అహ్మద్‌, మోహ్సిన్‌ ఖాన్‌, మయాంక్‌ యాదవ్‌, ఆకాశ్‌ మహరాజ్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌.

ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్ల జాబితా:

రాజస్థాన్‌: వైభవ్‌ సూర్యవంశీ, యుద్వీర్‌ సింగ్‌, అమన్‌ రావ్‌, రవి బిష్ణోయ్‌, రియాన్‌ పరాగ్‌.

లక్నో: ముకుల్‌ చౌదరి, మణిమారన్‌ సిద్ధార్థ్‌, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ, హిమ్మత్‌ సింగ్‌, అర్షిన్‌ కులకర్ణి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story