Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌ అరుదైన మైలురాయి.. రాయల్స్‌లో సిక్సర్ల కింగ్స్ వీరే!

Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ జట్టు తరఫున 100 సిక్సులు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

Rishvik
Published on: 8 April 2026 9:38 AM IST
Yashasvi Jaiswal
X

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌ అరుదైన మైలురాయి.. రాయల్స్‌లో సిక్సర్ల కింగ్స్ వీరే!

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌ అరుదైన మైలురాయి.. రాయల్స్‌లో సిక్సర్ల కింగ్స్ వీరే!

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ జట్టు తరఫున 100 సిక్సులు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్సులు కొట్టడంతో యశస్వి ఖాతాలో ఈ అరుదైన మైలురాయి చేరింది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ ఫ్రాంచైజీకి తరఫున కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. ఆ లిస్టులో ఉన్నది ఎవరో చూద్దాం.

రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా సంజు శాంసన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. సంజు 144 ఇన్నింగ్స్‌లలో 192 సిక్సర్లు బాదాడు. ఈ కేరళ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బౌలర్లపై విరుచుకుపడుతూ రాజస్థాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. జోస్ బట్లర్ 135 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బట్లర్ తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. మూడో స్థానంలో షేన్ వాట్సన్ ఉన్నాడు. రాజస్థాన్ జట్టు తొలి సీజన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాట్సన్ 109 సిక్సర్లు నమోదు చేశాడు.

తాజాగా ఈ ఎలైట్ క్లబ్‌లోకి యశస్వి జైస్వాల్‌ కూడా చేరాడు. జైస్వాల్‌ 2026 సీజన్‌లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. జైస్వాల్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బాదుడు మొదలెడతాడు. అతడి ఇంకా యువ ఆటగాడే అయినా.. ఇంత త్వరగా ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. త్వరలోనే వాట్సన్ రికార్డును.. ఆపై జోస్ బట్లర్‌ను కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2026లో వాట్సన్ రికార్డు బద్దలు కావడం పక్కా. రాజస్థాన్ రాయల్స్ తరఫున 100+ సిక్సర్లు కొట్టిన నాలుగో ఆటగాడిగా ఇప్పుడు జైస్వాల్‌ ఉన్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌లో సిక్సర్ల కింగ్స్ వీరే:

# సంజు శాంసన్ -192

# జోస్ బట్లర్ - 135

# షేన్ వాట్సన్ - 109

# యశస్వి జైస్వాల్‌ - 100

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story