Yuzvendra Chahal: ముదిరిన 'క్యూట్' మెసేజ్ వివాదం: కోర్టు మెట్లెక్కిన యుజ్వేంద్ర చాహల్.. తాన్యా ఛటర్జీకి షాక్!

Yuzvendra Chahal: నటి తాన్యా ఛటర్జీపై టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పరువు నష్టం దావా వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ తనకు మెసేజ్‌లు పంపారన్న నటి ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానానికి చేరాయి.

Arun Chilukuri
Published on: 18 April 2026 1:08 PM IST
Yuzvendra Chahal
X

Yuzvendra Chahal: ముదిరిన 'క్యూట్' మెసేజ్ వివాదం: కోర్టు మెట్లెక్కిన యుజ్వేంద్ర చాహల్.. తాన్యా ఛటర్జీకి షాక్!

Yuzvendra Chahal: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆటతో కాకుండా ఒక వివాదంతో ఆయన పేరు మార్మోగుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి స్పందిస్తూ చాహల్ 'క్యూట్‌గా ఉన్నావు' (Cute) అంటూ ప్రైవేట్ మెసేజ్‌లు పంపారన్న నటి తాన్యా ఛటర్జీ ఆరోపణలను ఆయన తీవ్రంగా పరిగణించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ఆరోపణలు చేశారంటూ తాన్యాపై చాహల్ పరువు నష్టం (Defamation) దావా వేశారు.

కొద్ది రోజుల క్రితం తాన్యా ఛటర్జీ ఒక ఇంటర్వ్యూలో తన ఫోన్ చూపిస్తూ.. చాహల్ తనకు నేరుగా మెసేజ్ చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు మరియు వీడియో నెట్టింట వైరల్ కావడంతో చాహల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై చాహల్ పిఆర్ (PR) టీమ్ స్పందించి, ఆ వీడియోను తొలగించాలని ఆమెను కోరినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఆమె మరింత రచ్చ చేయడంతో చాహల్ న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

పరువు నష్టం దావాపై తాన్యా తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "చాహల్ పంపిన మెసేజ్‌లు చూపినందుకు నన్నే అందరూ ట్రోల్ చేస్తున్నారు. పరువు పోయింది నాది, కానీ నాపైనే కేసు వేశారు. ఎందుకు ఎవరూ చాహల్‌ను ప్రశ్నించట్లేదు?" అని ఆమె ప్రశ్నించారు. తనకు చాహల్ అంటే గౌరవం ఉందని, కేవలం వాస్తవాలనే బయటపెట్టానని ఆమె వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉండటంతో చాహల్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story