Srikakulam: పలాస రైల్వే స్టేషన్‌లో 3.135 కిలోల గంజాయి పట్టివేత
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో 3.135 కిలోల గంజాయి పట్టుబడి ఒకరు అరెస్ట్ అయ్యారు. మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Srikakulam
Srikakulam: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. రైల్వే స్టేషన్‌లో తనిఖీల సందర్భంగా 3.135 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిరంజన్ మాలిక్ (ఏ-1) లిథు నాయక్ (ఏ-2) వద్ద నుంచి సుమారు 3.135 కిలోల గంజాయిని స్వీకరించి, దానిని బ్రౌన్ కలర్ ప్లాస్టర్‌తో చుట్టిన మూడు ప్యాకెట్లలో భద్రపరిచి నలుపు, నీలం రంగుల బ్యాక్‌ప్యాక్‌లో ఉంచుకొని రైలు ద్వారా తరలించేందుకు ప్రయత్నించాడు.
మంగళవారం పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయంలో బారువ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ హరిబాబు నాయుడు అనుమానంతో తనిఖీలు నిర్వహించగా నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 3.135 కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, రూ.100 నగదు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సరోజ్ నాయక్ (ఏ-3)ను కూడా నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సోంపేట సీఐ మంగరాజు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు.




