Kaviti: కవిటి మండలం ఆర్ బెలగాంలో కూటమి ప్రజా మద్దతు సమావేశం!

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఆర్ బెలగాం ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా సంతోష్ పట్నాయక్ నామినేషన్ వేయనున్నారు.

G.RAMBABU, SOMPET
Published on: 22 Oct 2026 6:34 AM IST
Kaviti
X

Kaviti: కవిటి మండలం ఆర్ బెలగాంలో కూటమి ప్రజా మద్దతు సమావేశం!

Kaviti: కవిటి మండలం ఆర్ బెలగాం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి కూటమి తరపున అభ్యర్థిగా జాడుపూడి ఆర్ఎస్ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ పట్నాయక్ ను కూటమి నేతలు ఎన్నుకున్నారు.

గతంలో సంచలన విజయం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మండల వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగినా, టీడీపీ తరపున పోటీ చేసి సంచలన విజయం సాధించిన ఏకైక ఎంపీటీసీగా సంతోష్ కుమార్ పట్నాయక్ నిలిచారు. ఆ సమయంలోనే తన పట్టుదల, ప్రజల్లో ఉన్న పలుకుబడిని నిరూపించుకున్నారు. అందుకే కూటమి నేతలు మరోసారి ఆయనకే అవకాశం కల్పించారు.

ఎంపీపీ రేసులో గెలుపు కీలకం

ప్రస్తుతం సంతోష్ పట్నాయక్ ఎంపీపీ రేసులో ప్రధానంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎంపీటీసీ ఎన్నికలో ఆయన గెలుపు అత్యంత కీలకంగా మారనుంది. అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఎంపీపీ పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూటమి వర్గాలు భావిస్తున్నాయి.

ఆరు గ్రామాల్లో ఆత్మీయ సమావేశం

ఈ మేరకు పంచాయతీ పరిధిలోని ఆర్ బెలగాం, రాపాకపుట్టుగ, శవసానపుట్టుగ, జీ బెలగాం, జాడుపూడి ఆర్ఎస్, బసవకొత్తూరు గ్రామాల ప్రజల మద్దతు కోరుతూ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ పట్నాయక్ మాట్లాడుతూ, 22వ తేదీ గురువారం నాడు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆరు గ్రామాల ప్రజలను కోరారు. పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరు గ్రామాల కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET