Kanchili: కంచిలి మండలంలో కూటమి ప్రచార హోరు.. ఎంపీపీ అభ్యర్థి ఘనస్వాగతం

Kanchili: కంచిలి మండలం బూరగాంలో కూటమి ఎంపీపీ అభ్యర్థి మాదిన రామారావు చేపట్టిన ఇంటింటి ప్రచారానికి మహిళలు, రైతులు, యువత నుంచి విశేష స్పందన లభించింది.

G.RAMBABU, SOMPET
Updated on: 3 Nov 2026 7:30 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి మండలంలో కూటమి ప్రచార హోరు.. ఎంపీపీ అభ్యర్థి ఘనస్వాగతం

కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం పంచాయతీలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం సాగింది. కూటమి బలపరిచిన ఎంపీపీ అభ్యర్థి మాదిన రామారావు ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

బూరగాంలో మాదిన రామారావుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. వైసీపీ పాలనలో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి మాదిన రామారావు మాట్లాడుతూ... "బూరగాం ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు.

గత ఐదేళ్లుగా కంచిలి మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పింఛన్లు.. ప్రతి విషయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మళ్లీ అభివృద్ధి మొదలైంది. నన్ను ఎంపీపీగా గెలిపిస్తే బూరగాం పంచాయతీతో పాటు మండలంలోని ప్రతి పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తా. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, ప్రతి ఇంటికి మంచినీరు, రైతులకు అండగా ఉంటా.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో కంచిలి మండలాన్ని ఆదర్శంగా నిలుపుతా. సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి" అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బి హరిబాబు నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET