Amadalavalasa: 44 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన!
Amadalavalasa: ఆమదాలవలసలో 44 మందికి కొత్త స్పౌస్ పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి.
Amadalavalasa: 44 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన!
ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో కొత్తగా మంజూరైన 44 స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ హాజరై లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఆధారంలేని కుటుంబాలకు పెన్షన్‌లు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తాయని అన్నారు.కొత్తగా మంజూరైన 44 స్పౌస్ పెన్షన్లు లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.పెన్షన్ డబ్బులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి సుజాత, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్ , జిల్లా అధికార ప్రతినిధి నందివాడ గోవింద రావు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




